Slippery Table Game: జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే భారీ విశేషాలు అవసరం లేదు.. అందుకు సాక్షం ఈ మేక పిల్ల వీడియో

ఓ మేక ఓ వీధిలోని ఇంటిముందు ఆడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ మేకకి ఫ్రెండ్స్‌ ఎవరూ లేరనుకుంటా.. ఒక్కతే ఆడుకుంటుంది అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Slippery Table Game: జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే భారీ విశేషాలు అవసరం లేదు.. అందుకు సాక్షం ఈ మేక పిల్ల వీడియో
Goat Video Viral

Edited By:

Updated on: Nov 07, 2022 | 6:00 PM

ఇటీవల సోషల్ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలు తమ యజమానులను అనుకరిస్తుంటాయి. ఏదైనా త్వరగా నేర్చుకుంటాయి. చిన్న పిల్లల్లా యజమానులతో కలిసి ఆడుకుంటాయి. అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో చాలానే ఉంటాయి. తాజాగా ఓ మేక ఓ వీధిలోని ఇంటిముందు ఆడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ మేకకి ఫ్రెండ్స్‌ ఎవరూ లేరనుకుంటా.. ఒక్కతే ఆడుకుంటుంది అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇల్లు లాక్‌ చేసి ఉంది. ఆ ఇంటి ముందు కొన్ని మెట్లు ఉన్నాయి. వాటి మధ్యలో వాహనాలను పైకి ఎక్కించేందుకు వీలుగా స్లైడ్‌ కట్టి ఉంది. సాధారణంగా ఇలాంటి చోట చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఓ మేక ఎప్పుడైనా ఎవరైనా ఆడటం చూసిందేమో… వెంటనే అక్కడ స్లైడ్‌ కనిపించగా ఆట మొదలెట్టింది.

దాని మీద నుంచి కిందకి జారుతూ జారుడుబల్ల ఆడతూ తెగ ఎంజాయ్‌ చేసింది. ఈ సీన్‌ ఎవరో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియోను వేలాదిమంది వీక్షించారు. తమ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..