Viral Video: అమ్మాయి స్టంట్‌కి బలైన అబ్బాయి.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

|

Dec 12, 2021 | 2:07 PM

Girl showed amazing stunt: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో విన్యాసాలకు సంబంధించినవి అనేకం ఉంటాయి. అయితే.. విన్యాసాలు అంత తేలికైన

Viral Video: అమ్మాయి స్టంట్‌కి బలైన అబ్బాయి.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Stunt Video
Follow us on

Girl showed amazing stunt: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో విన్యాసాలకు సంబంధించినవి అనేకం ఉంటాయి. అయితే.. విన్యాసాలు అంత తేలికైన పని కాదు. ఇందుకోసం స్టంట్స్ చేసేవారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒక స్టంట్ చేయడానికి కొంతమంది నెలల పాటు నిరంతరం సాధన చేయవలసి ఉంటుంది. అప్పుడు కానీ.. స్టంట్ పర్ఫెక్ట్‌గా రాదంటున్నారు నిపుణులు. మీరు సినిమాల్లో చాలా స్టంట్‌లను చూసి ఉంటారు.. చూడటానికి చాలా తేలికగా అనిపించవచ్చు. కానీ అవి నిజ జీవితంలో చేయడం చాలా కష్టం. సోషల్ మీడియాలో స్టంట్స్ కి సంబంధించిన చాలా వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఇవి చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి స్టంట్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసినవారంతా.. అమ్మాయి స్టంటుకి.. పాపం అబ్బాయి బలయ్యాడంటూ పేర్కొంటున్నారు.

రోడ్డుపై ఓ అమ్మాయి వేగంగా సైకిల్‌ తొక్కుతూ వచ్చి.. సడన్‌గా బ్రేకులు వేసి విన్యాసాలు చేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సడన్ బ్రేక్ వేయడంతో ఆమె సైకిల్ వెనుక చక్రం పైకి లేస్తుంది. అప్పుడే వెనుక నుంచి సైకిల్ పై వేగంగా వచ్చిన యువకుడు.. ఆమె ఆశలను వమ్ము చేశాడు. అబ్బాయి కారణంగా అమ్మాయి స్టంట్ ఫెయిల్ కావడంతోపాటు ఇద్దరు రోడ్డుపై పడిపోయారు.

వాస్తవానికి ఇద్దరూ కూడా స్టంట్స్ చేసేవారని తెలుస్తుంది. వాస్తవానికి అబ్బాయి కూడా వేగంగా సైకిల్ తొక్కుతూ వచ్చి బ్రేక్‌లు వేయడం మర్చిపోతాడు. దీంతో ఎదురుగా ఉన్న బాలిక సైకిల్‌ను ఢీకొట్టడంతో.. ఇద్దరూ పడిపోయారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనలో నష్టం జరగకపోవడంతో ఇద్దరూ వెంటనే లేచి నిలబడ్డారు.

వైరల్ వీడియో.. 

సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో best.failsever ఖాతా షేర్ చేసింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 84 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్ చేయడంతోపాటు వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి స్టంట్‌ను పాడు చేసాడని ఒక యూజర్ పేర్కొంటే.. ఆమెస్టంట్‌కు అబ్బాయే బలయ్యాడంటూ మరొక యూజర్ రాశాడు.

Also Read:

Viral Video: బుడ్డోడి పక్షి ప్రేమకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. మీ పిల్లలకూ ఇదే నేర్పించండి.. వీడియో వైరల్

Viral Video: పాపం.. ఈ సింహానికి ఏదో అయ్యిందనుకుంటా.. ఆందోళనలో జంతు ప్రేమికులు.. అదేం చేసిందంటే..?