AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జాకీచాన్ శిష్యురాలు ఈ కోతి.. స్టంట్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే..!

Viral Video: హాలీవుడ్ హీరో జాకీచాన్ సినిమాలను చూసే ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించిన యాక్షన్ హీరో. మార్షల్ ఆర్ట్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు

Viral Video: జాకీచాన్ శిష్యురాలు ఈ కోతి.. స్టంట్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే..!
Monkey
Shiva Prajapati
|

Updated on: Dec 12, 2021 | 1:47 PM

Share

Viral Video: హాలీవుడ్ హీరో జాకీచాన్ సినిమాలను చూసే ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించిన యాక్షన్ హీరో. మార్షల్ ఆర్ట్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాడి మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఈ లోకంలో లేకపోయినా.. అభిమానుల గుండెల్లో చిరస్మరణీయులయ్యారు. ఇదిలాంటే.. చాలా సినిమాల్లో రెండు బైక్‌లపై కాళ్లు పెట్టి నిలబడంటం, రన్నింగ్‌లో ఉన్న రెండు వాహనాలను చకచకా ఎక్కడం వంటి స్టంట్స్ మనం చూసే ఉంటాం. అయితే, మనుషులే కాదు.. ఈ ఫీట్‌ను తాము కూడా చేస్తామంటున్నాయి కోతులు. అనడమే కాదు.. ఊహించని రీతిలో స్టంట్స్ చేసి ఔరా అనిపించింది కోతి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. వీడియో చూస్తే.. జాకీచాన్ వద్ద శిక్షణ తీసుకుందా ఏంటి? అనేలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

వాస్తవానికి, కోతులు ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకు, ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదకు దూకుతుంటాయి. అయితే, ఇక్కడ ఓ కోతి.. సినిమా హీరోల లెవల్లో.. విన్యాసాలు చేస్తూ ఔరా అనిపించింది. రెండు చెట్ల మధ్యలో నిల్చుని ఓ కోతి.. హల్ చల్ చేసింది. రెండు చెట్లు మధ్యలో కొంత ఎత్తు వరకు ఎక్కి డిఫరెంట్ స్టైల్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తోంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, దీనిని వీడియో తీసిన కొందరు.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియో ఫిదా అయిపోతున్నారు. ‘కుంగ్ ఫు మంకీ’ అని, జాకీచాన్ శిష్యురాలు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 1 మిలియన్‌కు పైగా వ్యూస్ రాగా 58 వేల మందికి పైగా లైక్ చేశారు.

Viral Video

Also read:

Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్‌ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!

Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!

Dysfunctional Cells: షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆ.. కణాలను’ తొలగిస్తే.. శాశ్వత నివారణ అంటున్న శాస్త్రవేత్తలు