Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆడసింహాన్ని నీటిలోకి లాక్కెళ్లిన మొసలి.. ఆ తర్వాత సీన్ ఇది.. ధైర్యమున్నోల్లే చూడండి

Giant Crocodile Attack Video Goes Viral: తాజాగా X ప్లాట్‌ఫామ్‌లో @Predatorvids ద్వారా షేర్ చేసిన ఈ 24 సెకన్ల వీడియోను లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను 167,000 సార్లు వీక్షించారు. ఈ వీడియోపై వందలాది మంది నెటిజన్లు స్పందించారు.

Viral Video: ఆడసింహాన్ని నీటిలోకి లాక్కెళ్లిన మొసలి.. ఆ తర్వాత సీన్ ఇది.. ధైర్యమున్నోల్లే చూడండి
Crocodile Attack Lion
Venkata Chari
|

Updated on: Nov 05, 2025 | 10:59 AM

Share

Giant Crocodile Attack Video: సోషల్ మీడియాలో వన్యప్రాణుల పోరాటాలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా X ప్లాట్‌ఫామ్‌లో @Predatorvids అనే అకౌంట్ నుంచి షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో నెటిజన్లను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వీడియోలో ఒక భారీ మొసలి, అడవికి రారాజుగా భావించే సింహంపై దాడి చేసి, వేటాడింది.

నదిలో జీవన్మరణ పోరాటం..

సాధారణంగా సింహం తన వేగం, బలం కారణంగా అడవిలో ఎదురులేనిదిగా ఉంటుంది. అలాగే, నీటిలో మాత్రం మొసలికి తిరుగులేదనే సంగతి తెలిసిందే. ఈ వీడియోలో, ఒక సింహం నది చిత్తడి ప్రాంతంలో చిక్కుకుంది. అలాగే ప్రమాదకరకంగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో నదిలో మాటువేసిన మొసలి తన సహజ వేట వ్యూహాన్ని ఉపయోగించింది. నది ఒడ్డుకు చాలా దగ్గరగా ఉన్న సింహాన్ని లక్ష్యంగా చేసుకుని, నీటి అడుగున పొంచి ఉంది. మొదట సడన్‌గా సింహంపైకి దూసుకొచ్చింది. కానీ, సింహం ఈ దాడి నుంచి తప్పించుకుంది. ఇక రెండోసారి మొసలి దాడి నుంచి తప్పించుకోలేకపోయింది. సింహం కాలును తన పదునైన దవడలతో గట్టిగా పట్టుకుంది.

సింహం ఎంత కష్టపడి లాక్కున్నా, మొసలి పట్టు నుంచి తప్పించుకోలేకపోయింది. మొసలి దానిని క్షణాల్లో నీటిలోకి లాక్కెళ్లిపోయింది. నీటిలో మొసలి అపారమైన శక్తి ముందు, సింహం తన పోరాటంలో ఓటమి పాలైంది.

నది ఒడ్డున ఉన్న మిగతా సింహాలు కూడా ఈ భయంకర దృశ్యాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాయి. సింహాన్ని కాపాడడానికి అవి ముందుకు రాలేకపోయాయి. @Predatorvids ద్వారా షేర్ చేసిన ఈ 24 సెకన్ల వీడియోను లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను 167,000 సార్లు వీక్షించారు. ఈ వీడియోపై వందలాది మంది నెటిజన్లు స్పందించారు.

“జంగల్ అంటే ఇంతే, ఇక్కడ క్షణాల్లో రాజు-రాణి కూడా వేటగా మారిపోతారు” అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరొకరు “ప్రకృతి అందంగా, అద్భుతంగా ఉన్నప్పటికీ, దాని క్రూరత్వం కూడా అంతే భయంకరంగా ఉంటుంది” అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..