Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసిన కోతి.. మూడు రోజులు పాటు తన చెరలో ఉంచుకుని ఆ తరువాత..

Viral Video: ఇప్పటి వరకు మనుషులను కిడ్నాప్ చేయడమే మనం చూశాం.. మరి జంతువులు కిడ్నాప్ చేయడం చూశారా? పోనీ ఆ మాట అయినా విన్నారా?. సాధారణంగా కోతులు ఇంట్లోని

Viral Video: పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసిన కోతి.. మూడు రోజులు పాటు తన చెరలో ఉంచుకుని ఆ తరువాత..
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 23, 2021 | 2:26 PM

Viral Video: ఇప్పటి వరకు మనుషులను కిడ్నాప్ చేయడమే మనం చూశాం.. మరి జంతువులు కిడ్నాప్ చేయడం చూశారా? పోనీ ఆ మాట అయినా విన్నారా?. సాధారణంగా కోతులు ఇంట్లోని వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తాయని తెలుసు. కానీ, అవి కిడ్నాప్ కూడా చేస్తాయి. అవునండీ బాబూ.. ఇది నిజంగా నిజం. ఇప్పుడు మనం కిడ్నాపర్ కోతి గురించే చెప్పుకోబోతున్నాం. ఓ ఇంట్లోకి చొరబడిన కోతి.. పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసింది. కేవలం రెండు వారాల వయస్సు ఉన్న పెంపుడు కుక్కను కోతి ఎత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఈ కిడ్నాపర్ కోతికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మలేషియాలోని ఓ ఇంట్లోకి కోతి వచ్చింది. అది ఆహార పదార్థాల కోసమే వచ్చిందని అంతా భావించారు. కానీ, కోతి ఎవరూ ఊహించని రీతిలో ఇంట్లో ఉన్న చిన్న పెంపుడు కుక్కపిల్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. ఈ ఘటన సెప్టెంబర్ 16వ తేదీన జరిగింది. కిడ్నాప్‌నకు గురైన కుక్క పిల్లను కాపాడేందుకు కుటుంబ సభ్యులు సహా స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించారు. కానీ, కోతి అంత ఈజీగా వదిలితేనా.. మూడు రోజుల పాటు తన వెంటనే అట్టిపెట్టుకుంది. చెట్లపైనే తిరుగుతూ.. కుక్క యజమానులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. చివరికి మూడు రోజుల తరువాత ఎలాగోలా కోతి నుంచి ఆ కుక్క పిల్లను రక్షించారు. కుక్క పిల్ల కూడా సేఫ్‌గా ఉందని దాని యజమానులు తెలిపారు. అయితే ఆ కోతి.. కుక్క పిల్లలను తన పిల్లగా భావించి ఎత్తుకెళ్లిందని, తన వద్ద ఉన్నన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా కుక్క పిల్లలను కోతి ఎత్తుకెళ్లడానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అదికాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కుక్క పిల్లను కోతి కిడ్నాప్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి అడవిలో పెద్ద పెద్ద చెట్ల నడుమ సంచరిస్తుండగా.. ప్రజలు మాత్రం దానిని వెంబడిస్తూ కుక్క పిల్లను రక్షించేందుకు చేసిన ప్రయత్నంపై నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది చూడగా.. అంతే స్థాయిలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి.

Viral Video:

Also read:

Viral News: బాయ్ ఫ్రెండ్ కోసం ఇంత దారుణమా?.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న యువతులు.. షాకింగ్ వీడియో మీకోసం..

Bride Escape: తప్పతాగి పెళ్లికి సిద్ధమైన వరుడు.. అదును చూసి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు..

Donkey Marriage: కర్నూలు జిల్లాలో వింత ఆచారం.. గాడిదలకు ఘనంగా పెళ్లి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..