Bride Escape: తప్పతాగి పెళ్లికి సిద్ధమైన వరుడు.. అదును చూసి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు..
Bride Escape: పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి నూరేళ్ల జీవితం. అందుకే ప్రతీ జంట తమ పెళ్లిని ఘనంగా, మధుర స్మృతిలా చేసుకునేందుకు ప్లాన్ చేస్తారు. అయితే, కొంతమంది యువకులు మాత్రం తమకున్న
Bride Escape: పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి నూరేళ్ల జీవితం. అందుకే ప్రతీ జంట తమ పెళ్లిని ఘనంగా, మధుర స్మృతిలా చేసుకునేందుకు ప్లాన్ చేస్తారు. అయితే, కొంతమంది యువకులు మాత్రం తమకున్న చెడు అలవాట్లతో ఆదిలోనే.. ఆ పెళ్లి పట్ల వధువు పెట్టుకున్న ఆశలను చంపేస్తారు. పెద్దలకు గౌరవమిస్తూ తలవంచి తాళి కట్టించుకుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. యువతులు చాలా స్పీడ్‌గా ఉన్నారు. చాలా మంది యువతులు మంచి గుణాలు ఉన్న, తమకు నచ్చిన యువకులను ఎంచుకుంటున్నారు. తేడా వస్తే.. వారి స్టైల్లో ట్విస్ట్‌లు ఇస్తున్నారు. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే వారికి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వరుడికి ఓ వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ప్రేమించిన వ్యక్తే అయినా.. తనకు నచ్చి పని చేయడంతో బిగ్ షాక్ ఇచ్చింది. అది చూసి పెళ్లి కొడుకుతో పాటు.. పెళ్లికి వచ్చిన అతిథులు సైతం బిత్తరపోయారు. కొందరైతే మంచి పని చేసిందంటూ కితాబిచ్చారు.
ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మేరీల్యాండ్‌కు చెందిన సేరియా, సామ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే, పెళ్లికి బంధువులెవరినీ ఆహ్వానించలేదు. తన మాజీ ప్రియుడు కైల్‌ను మాత్రమే ఆహ్వానించింది సామ్. ఇదిలాఉంటే.. తనకు పెళ్లి అవుతుందనే ఆనందంలో వరుడు సేరియా.. మద్యం సేవించి పెళ్లి వేదికపైకి వచ్చాడు. అటూ ఇటూ తూలుతూ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఒళ్లు తెలియకుండా ప్రవర్తించారు. కింద పడుతూ.. లేస్తూనే యువతి వేలికి ఉంగరం తొడిగి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. అయితే, సేరియా చర్యతో చిర్రెత్తిపోయింది సామ్. ‘తప్పతాగి వచ్చాడు. ఉంగరాలను కూడా కింద పడేశాడు. ముఖంలోకి కూడా సరిగా చూడలేదు’ అంటూ సామ్ చాలా బాధపడింది. సేరియాతో పెళ్లి అయినప్పటికీ.. దానిని ఆమె పరిగణనలోకి తీసుకోలేదు. సేరియా తీరుపై తీవ్ర కోపం వ్యక్తం చేసింది. పక్కనే ఉన్న తన మాజీ ప్రియుడు కైల్‌ను వివాహానికి సిద్ధమైంది. ఈ తాగుబోతు వద్దంటూ.. తన మాజీ ప్రియుడితో కలిసి జంప్ అయ్యింది.
Also read:
Viral Video: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!