Viral: చేపల కోసం వల వేస్తే.. కనిపించిన షాకింగ్ దృశ్యం.. దెబ్బకు జాలర్లు పరుగో పరుగు!
అప్పుడప్పుడూ మనం ఊహించేది ఒకటయితే.. అక్కడ వేరొకటి జరుగుతుంది. ఇలాంటి జరిగిన ఘటనలు కోకొల్లలు.
అప్పుడప్పుడూ మనం ఊహించేది ఒకటయితే.. అక్కడ వేరొకటి జరుగుతుంది. ఇలాంటి జరిగిన ఘటనలు కోకొల్లలు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఘటన చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. వల వేయగా.. ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. చివరికి అందరూ పరుగో పరుగు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని కువాన్వాన్ గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు దగ్గరలోని నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్లారు. ఎప్పటిలానే నీళ్ళలోకి వల వేశారు. అనుకున్నట్లుగానే కాసేపటికి వల బరువెక్కింది. నీటిలో నుంచి వలను పైకి లాగుతుండగా వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. అంతే! దెబ్బకు అందరూ పరుగో పరుగు.. ఇంతకీ ఏం కనిపించిందంటారా.! వలలో చేపలకు బదులు 20 కేజీల కొండచిలువ పడింది. అందుకే జాలర్లు భయపడి అక్కడ నుంచి పరుగులు పెట్టారు.
కాగా, సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ స్పాట్ కు చేరుకోవడం.. చాకచక్యంగా కొండచిలువను వల నుంచి బయటికి తీసి బంధించడం జరిగింది. అనంతరం అతడు కొండచిలువను దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. కాగా, ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..