Photo Puzzle: దిమాక్ సే సోచో.. ఈ ఫోటోలోని నెంబర్ కనిపెడితే మీలో దమ్మున్నట్లే!
హలో గురూ.. బోరింగ్ టైం నుంచి బయటపడేందుకు ఫన్నీ వీడియోలు, మీమ్స్ చూస్తున్నారా.? అయితే కొంచెం సీన్ మార్చండి.

హలో గురూ.. బోరింగ్ టైం నుంచి బయటపడేందుకు ఫన్నీ వీడియోలు, మీమ్స్ చూస్తున్నారా.? అయితే కొంచెం సీన్ మార్చండి. అప్పుడప్పుడూ మీ బుర్రకు పదునుపెట్టండి. కూసింత మెదడుకు మేత వేస్తే పజిల్స్‌ను కూడా ఓ పట్టు పట్టేయొచ్చు. అయితే ఇవి అలాంటి.. ఇలాంటి పజిల్స్ కాదు.. పద సంపత్తి, వీకెండ్ బుక్స్‌లో వచ్చే పజిల్స్ ఒక ఎత్తయితే.. ఇవి మరో ఎత్తు. కళ్ళను మభ్యపెట్టడమే కాదు.. మిమ్మల్ని తికమక పెట్టేస్తాయి కూడా.. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ కోవకు చెందిన ఓ పజిల్‌పై లుక్కేద్దాం.. పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా..? చూస్తే బ్లాక్ డాట్స్‌తో కూడిన పింక్ కలర్ ఇమేజ్ అని చెప్పేస్తారు. అయితే అక్కడే ఒక నెంబర్ కూడా దాగుంది. అదేంటో మీరు గుర్తించాలి. మీకున్నది కేవలం 15 సెకన్లు.! ఆలోపు కనిపెట్టండి.. టైం అయ్యేసరికి మీరు కనుగొంటే.. యూ.. ఆర్.. టూ ఇంటిలిజెంట్ బాసూ.. ఒకవేళ కనిపెట్టకపోయినా.. ఏం పర్లేదు.. సమాధానం కోసం కింద ఫోటోను చూడొచ్చు. కానీ మీరు ట్రై చేయకుండా మాత్రం ఆన్సర్ చూడొద్దు. కిక్కు దొబ్బుద్ది సార్!
Yes Its 708 number
— telugufunworld (@telugufunworld) February 8, 2023
