AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్‌ఫుల్ దివ్యాస్త్రం.. పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆ సమస్యల ఊసే ఉండదిక..

దాల్చిన చెక్క అనేది కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన అద్భుతమైన ఔషధం. ఇది డయాబెటిస్ నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, ప్యాంక్రియాస్‌ను ఉత్తేజపరచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా దాల్చిన చెక్క చక్కటి పరిష్కారం.

పవర్‌ఫుల్ దివ్యాస్త్రం.. పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆ సమస్యల ఊసే ఉండదిక..
Cinnamon Water
Shaik Madar Saheb
|

Updated on: Apr 22, 2026 | 1:57 PM

Share

దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. దాల్చిన చెక్కను భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అంతకు మించి ఉన్నాయి. డయాబెటిస్ నియంత్రణ నుండి మహిళల ఆరోగ్య సమస్యల వరకు, బరువు తగ్గడం నుండి నోటి పరిశుభ్రత వరకు, దాల్చిన చెక్క అనేక సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారంగా నిలుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, జింక్, విటమిన్స్, నియాసిన్, థియాజిన్ వంటి చాలా పోషకాలున్నాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్ – యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.. అందుకే.. దాల్చిన చెక్క నీటిని రెగ్యులర్ గా తాగితే చాలా ప్రయోజనాలు చేకూరుతాయని.. పేర్కొంటున్నారు.

దాల్చిన చెక్క నీరు ప్రయోజనాలు..

డయాబెటిస్ నియంత్రణ: దాల్చిన చెక్క ప్రధాన ప్రయోజనాలలో ఒకటి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే దాని సామర్థ్యం. ఇది ప్యాంక్రియాస్‌ను ఉత్తేజపరచి, ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా డయాబెటిస్ ఉన్నవారిలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రాత్రిపూట డిన్నర్ తర్వాత దాల్చిన చెక్క పొడిని పలుచటి మజ్జిగలో లేదా వేడి నీటిలో కలిపి తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గడంలో సహాయం: అధిక బరువుతో బాధపడేవారికి దాల్చిన చెక్క ఒక మంచి తోడు. ఇది జీవక్రియను మెరుగుపరచి, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి, దాల్చిన చెక్కను రెండు మూడు ముక్కలుగా చేసి నీటిలో మరిగించి, ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం మంచిది.

మహిళల ఆరోగ్యానికి: దాల్చిన చెక్క ప్రత్యేకంగా మహిళల్లోని అనేక పీరియడ్స్ సంబంధిత సమస్యలకు ఒక అద్భుతమైన ఔషధం. పీరియడ్స్ క్రమరాహిత్యం, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, పీసీఓడీ (PCOD), పీసీఓఎస్ (PCOS), రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలకు దాల్చిన చెక్క ప్రయోజనకారి. ఇందులో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్ల సమతుల్యతను సరిచేసే గుణాలున్నాయి.

నోటి – దంత ఆరోగ్యం: దాల్చిన చెక్క నోటి దుర్వాసనను తగ్గించి, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నోటిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి, నోటి దుర్వాసన తగ్గుతుంది. దాల్చిన చెక్క పొడిని దంతాలపై అప్లై చేసి రెండు నిమిషాల తర్వాత పుక్కిలించడం వల్ల దంత ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ ప్రయోజనాలకు కారణం.

నాణ్యత – వినియోగంలో జాగ్రత్తలు: దాల్చిన చెక్కను ఎంచుకునేటప్పుడు, మంచి బ్రౌన్ రంగు, మంచి సువాసన ఉన్న నాణ్యమైన దాల్చిన చెక్కను ఎంచుకోవాలి. మార్కెట్‌లో కల్తీ దాల్చిన చెక్క కూడా అందుబాటులో ఉంటుంది.

ఇలాంటి వారు జాగ్రత్త..

కొంతమందికి దాల్చిన చెక్క శరీరంలో వేడిని పెంచుతుంది. అధిక శరీర వేడి ఉన్నవారు లేదా పైల్స్ వంటి సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవవచ్చు. అలాంటి వారు దాల్చిన చెక్క పొడిని సోంపు (ఫెన్నెల్ సీడ్స్) పొడితో కలిపి తీసుకోవడం వల్ల వేడి-చలువ సమతుల్యత ఏర్పడుతుంది. సోంపు చలువ గుణాలను కలిగి ఉండగా, దాల్చిన చెక్క వేడి గుణాలను కలిగి ఉంటుంది. ఈ రెండిటి మిశ్రమం శారీరక సమతుల్యతను కాపాడుతుంది.

దాల్చిన చెక్క ఎన్నో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో నిండిన ఒక అద్భుతమైన ఔషధం. దీన్ని సరైన పద్ధతిలో, అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

అయితే.. దాల్చిన చెక్క నీటిని.. ఉదయం, రాత్రి వేళల్లో దాల్చిన చెక్కను మరిగించి.. ఆ నీటిని ఎప్పుడైనా తాగవచ్చు.. దీనిలో తేనె కలుపుకుంటే.. మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి..

అయితే, ఏదైనా కొత్త ఆహార సప్లిమెంట్‌ను ప్రారంభించే ముందు నిపుణుడి సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us