AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయుర్వేద ప్రియులు అలర్ట్..! అశ్వగంధ ఆకులతో కాలేయానికి ముప్పు.. వాడకంపై సర్కార్ నిషేధం!

అశ్వగంధ.. ఆయుర్వేదంలో దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒత్తిడిని తగ్గించాలన్నా, కండరాల పుష్టికైనా, గాఢ నిద్రకైనా చాలామంది ఈ "ఇండియన్ జిన్సెంగ్" మీద ఆధారపడుతుంటారు. అయితే, ఇటీవల వెల్నెస్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల అధికారి (FSSAI), ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఆయుర్వేద ప్రియులు అలర్ట్..! అశ్వగంధ ఆకులతో కాలేయానికి ముప్పు.. వాడకంపై సర్కార్ నిషేధం!
Ashwagandha Leaves Ban
Balaraju Goud
|

Updated on: Apr 22, 2026 | 2:09 PM

Share

అశ్వగంధ.. ఆయుర్వేదంలో దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒత్తిడిని తగ్గించాలన్నా, కండరాల పుష్టికైనా, గాఢ నిద్రకైనా చాలామంది ఈ “ఇండియన్ జిన్సెంగ్” మీద ఆధారపడుతుంటారు. అయితే, ఇటీవల వెల్నెస్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల అధికారి (FSSAI), ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. అశ్వగంధ మొక్కలోని ఆకుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు, ఇది వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

నిషేధం ఎందుకు? అసలు చిక్కు ఎక్కడ?

సాధారణంగా అశ్వగంధ అంటే మనకు గుర్తుకు వచ్చేది దాని వేరు. ఆయుర్వేద గ్రంథాలలో వేరుని మాత్రమే ఔషధంగా వాడాలని పేర్కొన్నారు. కానీ, సప్లిమెంట్ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఆకులను కూడా వాడటం మొదలుపెట్టాయి. పరిశోధనల ప్రకారం.. అశ్వగంధ ఆకులలో విథాఫెరిన్-ఎ (Withaferin-A) సమ్మేళనం అధిక మోతాదులో ఉంటుంది. ఇది పరిమితి మించితే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆకుల సారాన్ని ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

వేరు సురక్షితమేనా?

అవును! అశ్వగంధ వేరు వాడకంపై ఎలాంటి నిషేధం లేదు. శతాబ్దాలుగా వేరును వాడటం వల్ల ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని, సరైన మోతాదులో తీసుకుంటే అది సురక్షితమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఆయుష్ మంత్రిత్వ శాఖ కేవలం ఆకులను మాత్రమే పక్కన పెట్టింది.

వినియోగదారులకు కలిగే ప్రయోజనం

ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులకు రెండు రకాల లాభాలు ఉన్నాయి. అయా కంపెనీలు తమ ప్యాకెట్ల మీద అశ్వగంధ వేరు వాడారా లేక ఆకులు వాడారా అన్నది స్పష్టంగా రాయాలి. మార్కెట్లో లభించే చౌకబారు సప్లిమెంట్ల నుండి ప్రజలకు రక్షణ లభిస్తుంది. “పూర్తిగా సురక్షితమని నిరూపణ అయ్యే వరకు ప్రమాదకరమైన మూలకాలను వాడకపోవడమే ఉత్తమం. సాంప్రదాయ ఆయుర్వేదం ఎప్పుడూ వేరు వాడకాన్నే సూచించింది.” అని ప్రముఖ డైటీషియన్లు సూచిస్తున్నారు.

మీరు అశ్వగంధ సప్లిమెంట్లను కొనే ముందు, దాని లేబుల్‌ను జాగ్రత్తగా గమనించండి. కేవలం వేరు ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రభుత్వం తీసుకున్న ఈ ముందుజాగ్రత్త చర్య వినియోగదారుల భద్రతను మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు.

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!