Viral: మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్.. చనిపోని వ్యక్తికి అంతిమయాత్ర.. ఎందుకో తెలిస్తే అవాక్కే
తమిళనాడులో ఓ అంతిమ యాత్ర వైరల్‌గా మారింది. సేలం జిల్లాలో జరిగిన జయమణి అనే వ్యక్తి అంత్యక్రియల గురించి రాష్ట్రమంతటా చర్చ జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్.. జయమణి అసలు చనిపోలేదు ... కానీ ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు ...

తమిళనాడులో విచిత్ర మొక్కులు ఎన్నో చూసుంటారు … వినుంటారు… కానీ ఇప్పుడు చెప్పబోయే మొక్కు చాలా డిఫరెంట్. అమ్మవారి మొక్కు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు చచ్చిన శవంలా ఉండి తన అంతిమయాత్ర ని నిర్వహించుకున్న పిచ్చి భక్తుడి గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. సేలం జిల్లాలోని కొండలంపట్టుకి చెందిన జయమణి స్థానికంగా చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. తమ ప్రాంతానికి సమీపంలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో అమ్మవారిని ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు. తను కోరుకున్న ప్రతిదీ నెరవేరడంతో ఈసారి అమ్మవారికి ఒక విచిత్ర మొక్కు మొక్కుకున్నాడు. దాన్ని కుటుంబసభ్యులు ముందు వ్యతిరేకించినా.. జయమణి పట్టుబట్టడంతో తరువాత ఒప్పుకున్నారు.
జయమణి అమ్మవారికి మొక్కుకున్న మొక్కు ఏంటంటే బ్రతికుండగానే అతనికి అంతిమ యాత్ర నిర్వహించడం. అతడు కోరినట్లగానే ఇంటి ముందు చనిపోయినట్టు ఫ్రీజర్ బాక్స్‌లో అతడిని ఉంచి, ఊరంతా సంతాప పోస్టర్లు వేయించి, బంధువులందరికి సమాచారమిచ్చి , పాడే కట్టి ఊరంతా శవాన్ని ఊరేగించినట్టు ఊరేగించి.. స్మశానంలో వదిలిపెట్టి వచ్చారు కుటుంబసభ్యులు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు చచ్చిన శవంలా శరీరంలో కదలిక లేకుండా ఉండి.. ఊరంతా జరిగిన తన అంతిమ యాత్రను చూసుకున్నాడు జయమణి. ఇదంతా అమ్మవారి మొక్కుకున్న మొక్కు కోసం అని చెబుతున్నాడు. ఈ వార్త ఇప్పుడు సేలం జిల్లాలో ట్రెండింగ్‌గా మారింది. ఇదేం మొక్కు సామి అని కొందరు పెదవి విరవగా.. మరికొందరు ఇది వెర్రితనం అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
