Viral News: ఉద్యోగమా? పెళ్ళా ఏదోకటి ఎంచుకోమన్న అధికారి.. దిమ్మదిరిగే ట్విస్ట్ ఇచ్చిన ఉద్యోగి
ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఒక భారతీయ వ్యక్తి తన షాకింగ్ కథను పంచుకున్నాడు. తన సోదరుడి వివాహానికి వెళ్లాల్సి వచ్చిందని.. అయితే కంపెనీ సెలవు ఇవ్వలేదు.. ఉద్యోగమా.. సోదరుడి పెళ్ళా ఏదోకటి ఎంచుకోమని చెప్పింది. దీంతో తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని అతను చెప్పాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ కంపెనీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

ప్రపంచంలో చాలా కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీ తమ ఉద్యోగులు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. మంచి జీతం ఇస్తుంది. అయితే కొన్ని కంపెనీలు జీతం ఇవ్వడం పక్కన పెడితే.. ఉద్యోగులకు కనీస సౌకర్యాలను కూడా కల్పించదు. ఉద్యోగి సెలవు అడిగినా ఇవ్వరు. వివాహం లేదా అనారోగ్యం ఎలా ఏ సందర్భంలోనైనా సరే సెలవు ఇవ్వరు. ఈ రోజుల్లో అలాంటి ఒక కేసు చర్చలో ఉంది. నిజానికి ఒక వ్యక్తి తన సోదరుడి వివాహానికి హాజరు కావడానికి ఆఫీసులో సెలవు అడిగాడు. అతనికి సెలవు ఇవ్వడానికి ఆ కంపనీ అంగీకరించలేదు. అప్పుడు ఆ వ్యక్తి మరో మాట లేకుండా ఉద్యోగం వదిలేశాడు.
ఈ సంఘటన గురించి ఒక భారతీయ వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పోస్ట్ చేసి మొత్తం కథను వివరించాడు. అమెరికాలో ఉన్న తన సోదరుడి వివాహానికి తన కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించినందున తాను తన ఉద్యోగాన్ని వదిలివేయాల్సి వచ్చిందని అతను ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. మూడు వారాల క్రితం తాను 15 రోజుల సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నానని .. అయితే తాను పని చేస్తున్న కంపెనీ.. పెళ్ళికి హాజరు కావాలా .. ఉద్యోగం కావాలా ఏదోకటి ఎంచుకోవాలని చెప్పిందని అప్పుడు తాను మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావించినట్లు చెప్పాడు.
రెండు ఆప్షన్లు ఇచ్చిన కంపెనీ ఆ వ్యక్తి పోస్ట్‌లో నాకు అమెరికా వెళ్లడానికి 15 రోజుల సెలవు కావాలని మూడు వారాల క్రితం నాపై అధికారిని అడిగాను. అపుడు సోదరుడి వివాహానికి వెళ్ళడానికి వీలు లేదని.. వెళ్ళాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలి అని చెప్పారని పేర్కొన్నాడు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని రెడ్డిట్ వినియోగదారులను అడిగాడు. 15 రోజులు కాకపోయినా 10 రోజులు అయినా సెలవు ఇవ్వమని కోరినా.. ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వమని చెప్పారని..అతను పేర్కొన్నాడు.
4 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాను. ఆ భారతీయ వ్యక్తి తాను గత 4 సంవత్సరాలుగా ఆ కంపెనీలో పనిచేస్తున్నానని.. అవసరమైతే ఎక్కువ సమయం కూడా పని చేసేవాడినని చెప్పాడు. తన పనికి తగిన జీతం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తాను వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు మళ్ళీ కంపెనీ నోటీసు వ్యవధిని పూర్తి చేయమని .. తనను బెదిరిస్తుందని అతను ఆరోపించాడు.
Got asked to choose between my brother’s wedding and my job. Am I wrong for walking away? byu/Chuckythedolll inTwoXIndia
రెడ్డిట్ వినియోగదారులు ఏమి చెప్పారు? ఆ వ్యక్తి పోస్ట్‌కి రకరకాల స్పందనలు వస్తున్నాయి. చాలా మంది రెడ్డిట్ యూజర్లు అతనికి మద్దతు పలికారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం పూర్తిగా సరైనదని అన్నారు. ఒక యూజర్ ఇలా రాశారు, ‘మీరు కెరీర్ కంటే కుటుంబాన్ని ఎంచుకున్నారు. ఇన్ని ఏళ్లుగా పని చేస్తున్న మిమ్మల్ని రిజైన్ చేయమని అడగనికి క్షణం కూడా ఆలోచించని ఆ కంపెనీ ఉద్యోగం చేసే బదులు.. మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది బాగుంది అని కామెంట్ చేశారు. మీ కంపెనీ మిమ్మల్ని కేవలం ఒక సాధనంగా చూసింది. దానిని వదిలివేయడం ద్వారా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు మరొక యూజర్ చెప్పారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు.. భవిష్యత్తులో కుటుంబంతో సమయం గడపడానికి ఉద్యోగం విడిచి పెట్టాను.. ఇది కరెక్ట్ కదా అని ఆలోచించవద్దు.. అని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




