మద్యం మత్తులో తాగుబోతులు ఏం చేస్తారో వారికే తెలియదు.. ఇల్లు పీకి పందిరేసిన వేస్తారు.. కొందరు ప్రమాదాల బారినపడుతుంటారు. కొందరు రోడ్డుపై ఎదురైన వారితో గొడవలు పడుతుంటారు. ఇంకొందరు ఇంట్లో వాళ్లను చిత్రహింసలు పెడుతుంటారు. ఇలా మందుబాబుల చేష్టలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంటారు. అలాంటి పనే చేశాడు ఇక్కడో తాగుబోతు.. మద్యం మత్తులో ఉన్న తాను రోడ్డుపై పడి పోతానేమోనన్న భయంతో ఫ్రెండ్స్‌కో, క్యాబ్‌కో కాల్ చేయకుండా.. ఏకంగా 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తాను ఎమర్జెన్సీలో ఉన్నానని త్వరగా రావాలని అంబులెన్స్ సిబ్బందితో చెప్పాడు. దీంతో నిజంగానే అత్యవసరంగా భావించిన అంబులెన్స్ స్పాట్‌కు చేరుకుంది. అయితే అక్కడున్న వ్యక్తిని ఆరా తీయగా అతడు చెప్పింది విని అంబులెన్స్ సిబ్బంది కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. పీకలదాకా తాగేసి ఉన్న అతడు.. తనను జనగాం పట్టణంలో వదిలిపెట్టాలని అంబులెన్స్ సిబ్బందిని కోరాదు. ఈ విచిత్ర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తిమ్మాపూర్ బైపాస్ దగ్గర బుధవారం రాత్రి జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడవడానికి కూడా వీలులేనంతగా మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎమర్జెన్సీ సర్వీస్ 108కి ఫోన్ చేశాడు. అత్యవసరం.. ప్రమాదంగా భావించిన అంబులెన్స్ సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. అయితే వాస్తవ పరిస్థితి తెలిసి షాక్‌కు గురయ్యారు.
A drunkard called an ambulance to drop him off at home
A man named Ramesh got drunk and called an ambulance while walking from Bhuvanagiri to Jangaon pic.twitter.com/Nqq3fmjT2s
— Tamreen Sultana (@tamreensultana) February 1, 2024
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి వద్ద బుధవారం అర్థరాత్రి రమేష్ అనే వ్యక్తి 108కి ఫోన్ చేశాడు. బాగా తాగి నడవలేక అంబులెన్స్‌కి ఫోన్ చేశాడు. ఎమర్జెన్సీగా అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది తాగుబోతును చూసి షాకయ్యారు. అలాగే తనను స్వగ్రామానికి తీసుకెళ్లాలంటూ 108 సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ దృశ్యాన్ని సిబ్బంది తమ కెమెరాలో రికార్డు చేశారు.
హైదరాబాద్ నుంచి జనగాం వెళ్లాలి. నడవలేను, బస్సులు లేవు. నన్ను జనగామ వరకు వదిలేయండి. నాకు అత్యవసర పరిస్థితి ఉంది. నేను స్పృహతప్పి పడిపోవచ్చని అంబులెన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. చివరకు తాగుబోతు ప్రవర్తనతో విసిగిపోయిన సిబ్బంది అతడిని అక్కడే వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రమేష్ తెలివితేటలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..