Viral: 36 గజాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
కేవలం 36 గజాల్లోనే డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని నిర్మించి అబ్బుర పరిచారు. 36 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం ఎలా సాధ్యమనేగా మీ సందేహం.. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ముంబయిలో కందివాలి ఏరియాలో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటికి సంబంధించి హౌజ్ టూర్ చేపట్టిన ఓ యూట్యూబర్...
భూమి ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ముంబయిలాంటి మెట్రోపాలిటన్ నగరంలో భూమి కొనుగోలు చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఇక జనాభ కారణంగా ముంబయిలో ఖాళీ స్థలం దొరకడం గగనంగా మారిపోయింది. అందుకే చిన్న స్థలంలోనే ఇల్లు నిర్మాణాలు చేపడుతుంటారు. తాజాగా ముంబయిలో నిర్మించిన ఓ ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కేవలం 36 గజాల్లోనే డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని నిర్మించి అబ్బుర పరిచారు. 36 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం ఎలా సాధ్యమనేగా మీ సందేహం.. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ముంబయిలో కందివాలి ఏరియాలో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటికి సంబంధించి హౌజ్ టూర్ చేపట్టిన ఓ యూట్యూబర్ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో..
Only possible in Mumbai RE
2BHK in 323 sq. ft.@VishalBhargava5 pic.twitter.com/7WmtlgcSLy
— DineshK (@systemstrader1) January 31, 2024
పేరుకు 36 గజాల్లో నిర్మించిన ఇల్లే అయినా.. ఇటీరియర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ఇంత తక్కువ స్థలంలో నిర్మించిన ఈ ఇంటిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. రెండు బెడ్‌రూమ్స్, ఒక హాల్, ఒక కిచెన్ ఉంది. ఈ ఇంటిలో ఇంటీరియర్ డిజైన్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈ ఇంటి ధర ఎంతో తెలుసా.? అక్షరాల రూ. 75 లక్షలు. అవును ఇంటి నిర్మాణం తక్కువ స్థలంలో జరిగినా ముంబయిలోని ఈ ఏరియాకు ఉన్న డిమాండ్ కారణంగా ఇంటి ధర అంతగా పలికింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంత చిన్న ఇంటికి రూ. 75 లక్షలా అని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..