AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: నిర్లక్ష్యానికి పరాకాష్ట.. రాత్రి వేళ నడిరోడ్డుపై కారుతో యువతుల ప్రమాదకర విన్యాసాలు.. దెబ్బకు మత్తు వదిలింది!

సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న యువత తీరుకు అద్దం పడుతోంది ఈ తాజా ఘటన. మద్యం మత్తులో వివేకాన్ని కోల్పోయి, ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఒక యువతి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.

Watch: నిర్లక్ష్యానికి పరాకాష్ట.. రాత్రి వేళ నడిరోడ్డుపై కారుతో యువతుల ప్రమాదకర విన్యాసాలు.. దెబ్బకు మత్తు వదిలింది!
Dangerous Car Stunt
Balaraju Goud
|

Updated on: Apr 17, 2026 | 4:48 PM

Share

సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న యువత తీరుకు అద్దం పడుతోంది ఈ తాజా ఘటన. మద్యం మత్తులో వివేకాన్ని కోల్పోయి, ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఒక యువతి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.

సోషల్ మీడియా X (ట్విట్టర్) వేదికగా @pradeepgr63 అనే ఖాతా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో, ఒక థార్ కారుపై ఇద్దరు యువతులు మద్యం మత్తులో ప్రమాదకరంగా కూర్చుని ఉన్నారు. రాత్రి సమయంలో నిర్మానుష్యమైన రోడ్డుపై ఈ విన్యాసాలు చేశారు. కారు పైకప్పుపై ఉన్న ఒక యువతి తనను తాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుండగా, డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆ వేగానికి, వాహనం కలిగిన కుదుపులకు సదరు యువతి తన సమతుల్యతను కోల్పోయి నేరుగా రోడ్డుపై వెనక్కి పడిపోయింది.

ఆ దృశ్యం చూస్తున్న ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉంది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరుగెత్తుకు రావడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతి, డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు.

“స్టంట్స్ సినిమాల్లో చూడటానికి బాగుంటాయి, కానీ రోడ్డు మీద చేస్తే ఎముకలు మాత్రమే విరుగుతాయి” అని ఒక వినియోగదారు హెచ్చరించారు. “మద్యం సేవించి ఇలాంటి విన్యాసాలు చేయడం ధైర్యం కాదు, మూర్ఖత్వం” అని మరొకరు వ్యాఖ్యానించారు. “రీల్స్ కోసం, లైకుల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఆపాలి” అంటూ పలువురు యువతకు సూచించారు.

నిజానికి, ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి. “మద్యం సేవించి వాహనం నడపడం నేరం” అని తెలిసినా, పైకప్పులపై కూర్చుని విన్యాసాలు చేయడం చట్టవిరుద్ధం. సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారాలనే ఆరాటం, ప్రాణాల కంటే ముఖ్యం కాదని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.

షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us