Trending Song: సినిమా విడుదలై ఏడాది.. ఇప్పటికీ సోషల్ మీడియాను ఊపేస్తోన్న సాంగ్.. ఏకంగా 10 లక్షల ఇన్‌స్టా రీల్స్
ఈ మధ్యన కొన్ని పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సాంగ్ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే సుమారు 10 లక్షలకు పైగా రీల్స్‌తో రికార్డులు కొల్లగొడుతోందీ ట్రెండింగ్ సాంగ్.

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా: ఛాప్టర్ 1. గతేడాది రిలీజైన ఈ సినిమా థియేటర్లు, ఓటీటీలో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా థియేటర్లలో ఈ సినిమా పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓవరాల్ గా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మరో అరుదైన ఘనతను సాధించింది. కాంతారా ఛాప్టర్ 1 సినిమా విడుదలై ఏడాది గడిచినా, దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ కొత్త రికార్డే నిదర్శనం. ప్రముఖ సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన భక్తి గీతం ‘ బ్రహ్మకలశం ‘, ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షలకు పైగా రీళ్లను దాటిన తొలి కన్నడ సినిమా పాటగా నిలిచింది. ‘బ్రహ్మ కలశం’ పాట సినిమా విడుదలైన రోజు నుంచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. డివైన్ స్టార్ రిషబ్ శెట్టి, నటి రుక్మిణి వసంత్ నటన, అజనీష్ సంగీతం, అభి వి. గానం ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాయి. సామాన్యులే కాకుండా, ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ పాటకు రీల్స్ చేశారు.
ఇప్పటికీ చాలా మంది ‘బ్రహ్మ కలశం’ ట్రాక్‌ను ఉపయోగించి ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తున్నారు. కన్నడ సంస్కృతి, నేపథ్యాన్ని ప్రతిబింబించే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో, ప్రధాన పాత్రలో నటించిన ఈ భక్తిరస చిత్రాన్ని ‘హోంబలే ఫిల్మ్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్ర తిష్ఠాత్మకంగా నిర్మించింది. కథ, నిర్మాణం, విజువల్స్ మాత్రమే కాకుండా, సాంగ్స్, నేపథ్య సంగీతం కూడాఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. త్వరలోనే ఈ ఫ్రాంఛైజీలో మరో సినిమా రానుందని ఇటీవలే రిషబ్ శెట్టి ప్రకటించాడు.
హోంబలే సంస్థ ట్వీట్..
A Divine Wave Across the World. 🔱🌍
The sacred chants of #Brahmakalasha continue to resonate everywhere, crossing 1 MILLION+ Reels on @instagram and becoming the First Kannada Song to achieve this historic milestone. ❤️🔥
An @AJANEESHB Musical 🎵 #Kantara #KantaraChapter1 pic.twitter.com/m1isghweta
— Hombale Films (@hombalefilms) July 18, 2026
కాంతారా ఛాప్టర్ 1 బ్రహ్మకలశం వీడియో సాంగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




