Viral Video: తలపై నీళ్ల గ్లాస్ తో కుక్క చేసే క్యాట్ వాక్ మీరెప్పుడైనా చూశారా
సోషల్ మీడియాలో రోజుకో ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. వీటిలో కొన్ని వీడియోలు నవ్వుతూ, చక్కిలిగింతలు పెడుతుంటే, కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. వ్యక్తులు చేసే విన్యాసాలు చూసి ఔరా అనుకుంటాం. అయితే కొన్నిసార్లు ఆ...
సోషల్ మీడియాలో రోజుకో ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. వీటిలో కొన్ని వీడియోలు నవ్వుతూ, చక్కిలిగింతలు పెడుతుంటే, కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. వ్యక్తులు చేసే విన్యాసాలు చూసి ఔరా అనుకుంటాం. అయితే కొన్నిసార్లు ఆ బాధ్యతను జంతువులు కూడా నిర్వరిస్తాయన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఓ కుక్క చేసిన స్టంట్ నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తోంది. కుక్కలకు అనుకరించే శక్తి చాలా ఎక్కువ. వాటికి ట్రైనింగ్ ఇస్తే ఏదైనా చేస్తాయి. ఈ వీడియోలో ఒక కుక్కు తన తలపై గ్లాస్ నిండా నీళ్లతో చాలా హాయిగా క్యాట్ వాక్ చేస్తుండటాన్ని మనం చూడవచ్చు. నీళ్లు కింద పడకుండా నెమ్మదిగా వెళ్లడం, కుదురుకున్నాక స్పీడ్ గా వెళ్లడాన్ని గమనించవచ్చు.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తలపై గ్లాస్ పెట్టుకుని నడపడాన్ని చూస్తుంటే కుక్క చాలా ప్రాక్టీస్ చేసినట్టు అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
कुत्ते का ऐसा स्टंट शायद ही आपने देखा हो..! pic.twitter.com/xkwOYtX5tb
ఇవి కూడా చదవండి— @StunnedVideo (@kumarayush084) June 25, 2022
డాగీ చేసిన ఈ స్టంట్ చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అన్‌బిలీవబుల్, ఇది ఉత్తమ కుక్క అని, ఒక మోడల్ తలపై పుస్తకం పెట్టుకుని ర్యాంప్ వాక్ చేసినట్లే, ఈ కుక్క తలపై గ్లాసు నిండా నీళ్లతో నడుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.