Viral Video: వారెవ్వా.. ఈ కుక్క టాలెంట్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇంతకీ ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలు తెగ వైరల్ అవుతుంటాయి. జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోల గురించి
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలు తెగ వైరల్ అవుతుంటాయి. జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరుత పులుల వేటలు.. కోతుల అల్లరి ఆటలు.. ఇలా ఒక్కటేమిటీ అనేక వీడియోస్ చక్కర్లు కొడుతుంది. ఇక ఇందులో గ్రామ సింహం.. అదేనండి.. కుక్క పిల్లల వీడియోస్ కూడా అధికంగా ఉన్నాయి. సాధారణంగా.. కుక్కపిల్లలను చాలా మంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు.. తమ ఇంట్లోని సభ్యులమాదిరిగానే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమ పిల్లలతోపాటు.. వాటికి కూడా పలు రంగాల్లోనూ ట్రైనింగ్ ఇస్తుంటారు. తాజాగా ఓ కుక్కపిల్ల పియానో వాయిస్తూ సాంగ్ పాడేస్తుంది. అద్భుతమైన గొంతుతో పాటలు పాడుతున్న కుక్కపిల్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అందులో ఓ చిన్న కుక్క పిల్ల ఎంతో అద్భుతంగా పియానో వాయిస్తూ.. అందుకు అనుగుణంగా గొంతెత్తి పాట పాడుతుంది. పియానో శబ్దానికి సరి సమానంగా పాట పాడుతుంది. ఈ వీడియో వరల్డ్ వైడ్ వీడియోస్ అనే ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తూ వాటే సింగర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కుక్కపిల్ల పాట పాడడం చూసిన నెటిజన్స్.. పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా… అందంగా సాంగ్ పాడుతున్న ఈ కుక్కపిల్ల వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..
View this post on Instagram
Also Read: Aamir Khan: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..
Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..