Viral Video: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా.. యాజమాని అంటే ఎంత ప్రేమో
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. కొన్ని ఫన్నీగా, మరి కొన్ని సెంటిమెంటల్ గా, ఇంకొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఎప్పటికప్పుడు నెట్టింట్లో ఏదో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. జంతువులకు సంబంధించిన వీడియోలు,,,
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. కొన్ని ఫన్నీగా, మరి కొన్ని సెంటిమెంటల్ గా, ఇంకొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఎప్పటికప్పుడు నెట్టింట్లో ఏదో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. జంతువులకు సంబంధించిన వీడియోలు చూసేందుకు చాలా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అందులోనూ కుక్కలకు ఉండే క్రేజే వేరు. అవి మనుషులకు అత్యంత సన్నిహిత మిత్రులని తెలిసిందే. వాటికి సరైన ట్రైనింగ్ ఇస్తే అవి అద్భుతాలు చేస్తాయి. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. వైరల్ అవుతున్న వీడియోలో, యజమాని ఇంట్లోకి రాగానే కుక్కు వెంటనే ఆనందంతో అతని దగ్గరకు వస్తుంది. తోకను ఆనందంతో కదిలిస్తుంది. క్లిప్ చూస్తుంటే ఓ మోడల్‌ని కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కుక్క తన యజమాని వద్దకు చేరుకోగానే, ఆ వ్యక్తి కుక్కను ఆప్యాయంగా తాకగా, కుక్క అక్కడే పడుకుంటుంది.
shaq_thebuldog అనే ఖాతా ద్వారా ఈ వీడియో Instagramలో పోస్ట్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్కను విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ఈ కుక్క నిజంగా అద్భుతంగా ఉందని, తాము దానితో ప్రేమలో పడ్డానని ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ డాగీ ఫ్యాషన్ వాక్ పాల్గొనాలని మరొకరు కామెంట్ చేశారు. అంతే కాకుండా చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా ప్రశంసలు కురిపించారు.