AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జాంటీ రోడ్స్ ని మించిపోయిందిగా ఈ కుక్క.. క్యాచ్ పట్టిన తీరు చూస్తే ఫిదాకాని వారుంటారా..

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మైదానంలో కుక్కతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి వంగి కుక్క తనమీదకి ఎక్కి.. ఎగిరేందుకు వీలు కల్పించాడు. మరో వ్యక్తి.. తన చేతిలోని బంతిని గాలిలోకి విసిరాడు..

Viral Video: జాంటీ రోడ్స్ ని మించిపోయిందిగా ఈ కుక్క.. క్యాచ్ పట్టిన తీరు చూస్తే ఫిదాకాని వారుంటారా..
Viral Video
Surya Kala
|

Updated on: Aug 21, 2022 | 11:15 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో తరచుగా ఫన్నీ వీడియోలు ఇక్కడ వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను చాలా అలరిస్తున్నాయి. వీటి పదే పడే చూస్తూ.. నవ్వుకోవడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఒక కుక్క  ఓ రేంజ్ లో ఎత్తుకు ఎగిరి తన లక్ష్యాన్ని అందుకుంది. ఈ వీడియో చూస్తే.. కుక్క నైపుణ్యానికి ప్రశంసించకుండా ఉండరు.

కుక్కలు మనిషికి అత్యంత విశ్వాసం గల జంతువు మాత్రమే కాదు.. వాటికీ సరిగ్గా శిక్షణ ఇస్తే మనిషిలా పనులు కూడా చేయగలవని అనేక వీడియోల ద్వారా వెల్లడవుతుంది. అత్యంత నమ్మకమైన జంతువు కుక్కకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తాయి.  కుక్క తన విన్యాసాలు, తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరాస్తూనే ఉంటుంది. తమ పెంపుడు కుక్కల వీడియోలను పోస్ట్ చేస్తూ.. తమ సంతోషన్ని ఇతరులతో పంచుకుంటారు. తాజాగా చాలా తెలివైన కుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శునకం  బంతిని పట్టుకోవడానికి గాలిలో చాలా ఎత్తుకు ఎగిరింది. ఈ వీడియో చూపరుల కళ్ళను చెదిరేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by Malinois (@malinois.gram)

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మైదానంలో కుక్కతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి వంగి కుక్క తనమీదకి ఎక్కి.. ఎగిరేందుకు వీలు కల్పించాడు. మరో వ్యక్తి.. తన చేతిలోని బంతిని గాలిలోకి విసిరాడు.. ఇలా బంతిని గాలిలోకి విసరాగానే.. కుక్క కొంచెం దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చి.. వంగి ఉన్న వ్యక్తి వీపుమీదకు ఎక్కి.. అక్కడ నుంచి గాలిలోకి ఎగిరి.. నోటితో బంతిని క్యాచ్ పట్టింది. కుక్క నైపుణ్యం గురించి వర్ణించడం కంటే.. అది క్యాచ్ పట్టిన తీరుని చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా సరే..

ఈ వీడియో malinois.gram అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియో చూసి రకరకాల కామెంట్స్  చేస్తున్నారు. ఈ కుక్కకు మంచి శిక్షణ ఇచ్చినట్లు కనిపిస్తోందని ఒకరు… ఈ కుక్క చేసిన జంప్ చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. మొత్తానికి క్యాచ్ పట్టడంలో జాంటీ రాడ్స్ తో పడింది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!