Viral Video: అబ్బా ఆంటీస్.. ఇలాంటి డ్యాన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. నవ్వాపుకోలేరు భయ్యా..
సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియో, పెళ్లి బరాత్, డ్యాన్స్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక పెళ్లిల్లో ప్రజలు వేసే డ్యాన్స్‌లు అదుర్స్ అనిపిస్తాయి. చిన్న పిల్లలు మొదలు, పెద్దల వరకు డ్యాన్స్ ఇరగదీస్తారు.
సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియో, పెళ్లి బరాత్, డ్యాన్స్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక పెళ్లిల్లో ప్రజలు వేసే డ్యాన్స్‌లు అదుర్స్ అనిపిస్తాయి. చిన్న పిల్లలు మొదలు, పెద్దల వరకు డ్యాన్స్ ఇరగదీస్తారు. తాజాగా అలాంటి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కొందరు మహిళలు వేసిన డ్యాన్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. భూమి గురుత్వాకర్షణ శక్తికే సవాల్ విసురుతూ వారు వేసిన డ్యాన్స్‌కి యావత్ సోషల్ మీడియా లోకం సలామ్ కొడుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో తీన్మార్ మ్యూజిక్ వస్తోంది. ఆ మ్యూజిక్ తగ్గట్లుగా ఓ నలుగురు మహిళలు డ్యాన్స్ వేశారు. చిత్ర విచిత్రంగా వారు వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి డ్యాన్స్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మహిళలు 30 డిగ్రీలు వెనుకకు వంగి నృత్యం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీరి డ్యాన్స్ స్టెప్ చూసి జనాలు గురుత్వాకర్షణ శక్తి కూడా వీరి ముందు బలాదూర్ అని కామెంట్స్ పెడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..