Viral Video: బట్టలు ఉతుకుదామని వాషింగ్ మెషీన్ ఓపెన్ చేసిన మహిళ.. లోపల టబ్‌లో
ఎండాకాలం మొదలయ్యింది. 10 దాటగానే సూర్యుడు చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో వేసవి తాపానికి వన్యప్రాణులు, పాములు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చిన పామును.. బాగా మరుగు ప్రాంతం లేదా కాస్త చల్లగా ఉన్న ప్రదేశాలు చూసుకుని నక్కి ఉంటాయి. అప్రమత్తంగా లేకపోతే కాటు పడుతుంది...

సర్పాలంటే ప్రతి ఒక్కరికీ అంతు లేని భయం..! విష పూరితమైన సర్పాలంటే గుండెల్లో దడ…! పాము కాటేస్తే కాటికెళ్లాల్సిందే అనే భయంతో.. అవి కనబడగానే మట్టుపెట్టేస్తారు. కానీ.. పాములలో ఎన్నో రకాల జాతులు విషం లేనివే. కాటు వేస్తే గాయమవడమే తప్ప ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. మీకు ఏదైనా పాము కనిపిస్తే.. అది విషపూరితం అయినా కాకపోయినా వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడం మంచిది. అయితే మీకో సూచన.. పాముల విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, పొలాలకు దగ్గరిగా ఉండేవారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఎండాకాలం మొదలయింది. వేసవిలో వేడి తాపానికి.. పాములు నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అవి ఇళ్లలోకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ నక్కి ఉంటాయి. మనం గమనించకపోతే కాట్లు పడతాయి.
తాజాగా ఆస్ట్రేలియాలో ఓ కుటుంబం వాషింగ్ మెషీన్‌లో పాము కనిపించడంతో.. గగుర్పాటుకు గురైంది. వెంటనే వారు స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. క్వీన్స్‌ల్యాండ్‌లోని గోల్డ్ కోస్ట్ శివారు ప్రాంతమైన మౌడ్స్‌ల్యాండ్‌లోని ఒక కుటుంబం ఇంటికి వచ్చినప్పుడు స్నేక్ క్యాచర్.. ఎలాంటి ప్రమాదకర పామును గుర్తించాడో చూపించే వీడియోను హడ్సన్ స్నేక్ క్యాచింగ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆ ఇంట్లోని వాషింగ్ మెషిన్ టబ్ లోపల ప్రపంచంలోనే రెండవ అత్యంత విషపూరితమైన పాము అయిన ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్ ఉంది. అనంతరం స్నేక్ క్యాచర్ తన పనిని ప్రారంభించి.. ఆ పామును రెస్క్యూ చేశాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Video Credit: Hudson Snake Catching – Gold Coast Snake Catcher
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.