AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్లు పెట్టి కొన్న ఇల్లు.. తీరా కిటికీ తెరిచి చూసి పరుగో పరుగు.. అసలు ఏం జరిగిందంటే

ఉన్నంతలో పొదుపుగా జీవిస్తూ సొంత ఇంటి కోసం డబ్బు జమ చేసుకున్నారు. ఆ మొత్తాన్ని కలిపి ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటి పట్ల ఎన్నో ఆశలు, ఆసక్తితో ఉన్నారు. వీలైనంత త్వరగా తమ కలల ఇంటికి మారాలని కోరుకున్నారు. అయితే, వారు త్వరలో తామెంతో ఇష్టపడి కొనుకున్న ఇంటికి షిఫ్ట్‌ అయి వెళ్లినప్పుడు..అక్కడ వారికి ఊహించని పరిస్థితి ఎదురైంది.

కోట్లు పెట్టి కొన్న ఇల్లు.. తీరా కిటికీ తెరిచి చూసి పరుగో పరుగు.. అసలు ఏం జరిగిందంటే
New House Now Disturbing Truth
Jyothi Gadda
|

Updated on: Dec 19, 2024 | 4:43 PM

Share

సొంతిళ్లు అనేది.. ప్రతి ఒక్కరికి తమ చిరకాల స్వప్నం. ఆ కల సాకారం చేసుకునేందుకు అందరూ ఆరాటపడుతుంటారు. ఇళ్లు కొనాలనే ఆశ, అవసరంతో చాలా మంది దాని చుట్టుపక్కల పరిసరాలు, పరిస్థితులను తెలుసుకోకుండానే.. అడుగు ముందుకు వేస్తుంటారు. మంచి ఇల్లు అని తెలియగానే వెంటనే కొనేస్తుంటారు. తీరా ఆ ఇంట్లోకి మకాం మార్చిన తరువాత అక్కడి పరిస్థితులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. అలాంటి షాకింగ్‌ ఘటనే ఓ జంటకు కూడా ఎదురైంది. చౌకైగా లభించిన ఇల్లు.. వారికి భరించరాని భారంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

నివేదిక ప్రకారం, యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్న ఓ జంట వాల్టర్ బ్రౌన్, అతని భార్య షారన్ కెల్లీ ఎంతోకాలంగా కష్టపడి డబ్బు సంపాదించుకున్నారు. ఉన్నంతలో పొదుపుగా జీవిస్తూ సొంత ఇంటి కోసం డబ్బు జమ చేసుకున్నారు. ఆ మొత్తాన్ని కలిపి ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటి పట్ల ఎన్నో ఆశలు, ఆసక్తితో ఉన్నారు. వీలైనంత త్వరగా తమ కలల ఇంటికి మారాలని కోరుకున్నారు. అయితే, వారు త్వరలో తామెంతో ఇష్టపడి కొనుకున్న ఇంటికి షిఫ్ట్‌ అయి వెళ్లినప్పుడు..అక్కడ వారికి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఈ ఇల్లు ఎలాంటిదో తెలిసి వారు తీసుకున్న నిర్ణయం పట్ల పశ్చాతపం వ్యక్తం చేశారు.

ఈ ఇంటికి సంబంధించి వాల్టర్ బ్రౌన్, అతని భార్య షారన్ కెల్లీ తమ కొనుగోలు చేసిన ఇంటి పరిసరాలను చూసి షాక్‌ తిన్నారు. ఆ ఇంటిని చూసిన వెంటనే వారు ఆ కొత్త ఇంటిని వదిలి వెళ్ళవలసి వచ్చింది. తమెంతగానో కష్టపడి సంపాదించిన డబ్బుతో 3,58,000 పౌండ్లు అంటే రూ. 3 కోట్ల 84 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేశానని, అయితే దాని కిటికీలు తెరవగానే తన ముందు భిన్నమైన దృశ్యం కనిపించిందని వారు వాపోయారు. కిటికీ తెరవగానే వారికి ఒక పెద్ద డంపింగ్‌ యార్డ్‌ కనిపించింది. అయితే, ఇల్లు కొనే ముందు ఈ చెత్త కుప్పను చూశామని, దీనిపై డెవలపర్‌లకు కూడా ఫిర్యాదు చేశామని దంపతులు చెబుతున్నారు. కానీ, వారు తమకు నచ్చజెప్పారని అంటున్నారు. మీరు ఈ ఇల్లు కొనుక్కోండి, డబ్బు చెల్లింపు తర్వాత శుభ్రం చేయడం మా బాధ్యత అని చెప్పాడని అన్నారు. ఆ తర్వాత అనేక వారాలు గడిచినా ఇప్పటికీ అక్కడ చెత్త అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా ఇంటికి సంబంధించి.. ఇంత తక్కువలో ఇక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టమని అత్యాశతో మాత్రమే కొన్నామని చెప్పాడు. అంతే కాదు ఈ ఇల్లు కట్టిన స్థలం చుట్టూ సరైన రోడ్డు కూడా లేదని అన్నారు. సోషల్ మీడియాలో వార్త వైరల్‌గా మారడంతో ఈ సంఘటన మనందరికీ ఒక పాఠం లాంటిది అంటున్నారు నిపుణులు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి