వలలో 23 కోట్లు… పిచ్చోడు వదిలేశాడు

సముద్రంలోకి వేటకు వెళ్ళాడు.. లక్కీగా కాస్ట్లీ చేప చిక్కింది.. దాయు విలువా అతనికి తెలుసు.. కానీ.. ఆ అత్యంత విలువైన చేపని అలాగే సముద్రంలోకి వదిలేశాడు.. ఇంతకీ ఆ చేప విలువ ఎంతో తెలుసా ? వివరాలు వింటే ఆశ్చర్యపోతారు.. ఐర్లాండ్‌లోని వెస్ట్‌కార్క్‌కు చెం దిన డేవ్‌ ఎడ్వర్డ్స్‌కు సముద్రంలో ఒక భారీ ట్యూనా చేప చిక్కింది. దాని విలువ అక్షరాలా మూడు మిలియన్ల యూరోలు. మన కరెన్సీలో చెప్పా లంటే దాదాపు రూ. 23 కోట్లు. […]

వలలో 23 కోట్లు... పిచ్చోడు వదిలేశాడు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 01, 2019 | 2:06 PM

సముద్రంలోకి వేటకు వెళ్ళాడు.. లక్కీగా కాస్ట్లీ చేప చిక్కింది.. దాయు విలువా అతనికి తెలుసు.. కానీ.. ఆ అత్యంత విలువైన చేపని అలాగే సముద్రంలోకి వదిలేశాడు.. ఇంతకీ ఆ చేప విలువ ఎంతో తెలుసా ? వివరాలు వింటే ఆశ్చర్యపోతారు..
ఐర్లాండ్‌లోని వెస్ట్‌కార్క్‌కు చెం దిన డేవ్‌ ఎడ్వర్డ్స్‌కు సముద్రంలో ఒక భారీ ట్యూనా చేప చిక్కింది. దాని విలువ అక్షరాలా మూడు మిలియన్ల యూరోలు. మన కరెన్సీలో చెప్పా లంటే దాదాపు రూ. 23 కోట్లు. అయితే, డేవ్‌ అమ్మడానికి ఎప్పుడూ చేపలు పట్టలేదు. అట్లాంటిక్‌ సముద్రంలో చేపలపై అధ్యయనం కూడా ఆయన సరదాలో భాగమే. ఇదే కోవలో ఆయన చేపలు పడు తుండగా ఈ ఎనిమిదన్నర అడుగుల భారీ చేప చిక్కింది. ట్యూనా చేపకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా 270 కేజీలు ఉన్న మత్స్యరాజం విలువ 23 కోట్ల రూపాయల పైమాటే. అయితే ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా షేర్‌ చేసిన అనంతరం ట్యూనాను  తిరిగి సముద్రంలోకి  వదిలేశానని తెలిపారు.