Viral: ఇష్టంగా ఫ్రైడ్ రైస్ తినాలనుకున్నాడు.. కనిపించిన దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నాడు

|

Jul 31, 2022 | 10:55 AM

Chandigarh: చండీగఢ్‌లోని (Chandigarh) నెక్సస్ ఎలాంటే మాల్‌లోని నిహావో కియోస్క్‌ అనే రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్ చేసిన ఆహారంలో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. కస్టమర్‌ దీనిపై ఫిర్యాదు చేయగా..

Viral: ఇష్టంగా ఫ్రైడ్ రైస్ తినాలనుకున్నాడు.. కనిపించిన దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నాడు
Fried Rice
Follow us on

Chandigarh: ఇటీవల హోటల్‌ ఫుడ్స్‌, ఆర్డర్స్‌లలో చనిపోయిన బల్లులు, బొద్దింకలు దర్శనమిస్తున్నాయి. ఫుడ్‌ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా చండీగఢ్‌లోని (Chandigarh) నెక్సస్ ఎలాంటే మాల్‌లోని నిహావో కియోస్క్‌ అనే రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్ చేసిన ఆహారంలో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. సంబంధిత కస్టమర్‌ దీనిపై ఫిర్యాదు చేయగా.. రెస్టారెంట్‌ సిబ్బంది మాత్రం ఉల్లిపాయముక్కంటూ కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే చండీగఢ్‌ నగరంలో నివాసముండే అనిల్‌ హవో రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్‌ రైస్ ఆర్డర్‌ చేశాడు. అయితే డెలివరీ బాయ్‌ అందించిన ఫుడ్‌ ఐటమ్‌లో బొద్దింక కనిపించడంతో షాక్‌ అయ్యాడు. వెంటనే ఆ ఫ్రైడ్‌ రైస్‌ పట్టుకుని సంబంధిత రెస్టారెంట్‌కు పరుగుతీశాడు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే వారు అది బొద్దింక కాదు.. ఉల్లిపాయ ముక్క అని సమాధానమివ్వడంతో అనిల్‌ నోరెళ్లపెట్టాడదు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

నిన్న బల్లి, నేడు బొద్దింక

కాగా రెస్టారెంట్‌ నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కస్టమర్‌. దీంతో పోలీసులు ఆహారాన్ని ల్యాబ్‌కు పంపించారు. ఈ ఫుడ్‌ కలుషితమైనదని తేలితే రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా కస్టమర్‌ ఫిర్యాదుపై సంబంధిత మాల్‌ ప్రతినిధి స్పందించారు. తమ మాల్‌లోని ఫుడ్‌ కోర్టును క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఓ ప్రకటనలో తెలిపారు. ‘మా ఫుడ్‌ కోర్ట్‌లో ఇటీవల కాలంలో జరిగిన రెండో సంఘటన ఇది. ఇది మాకు అంత మంచిది కాదు. మాకు పరిశుభ్రత, భద్రత చాలా ముఖ్యం. ఫుడ్‌కోర్టులో విషయంలో ఆడిట్ నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటాం’ అని ప్రకటించారు. కాగా గత నెలలో ఇదే ఫుడ్‌ కోర్టులో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ కస్టమర్ చేసిన ఆర్డర్‌లో బల్లి కనిపించిందని ఇలాగే ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..