Viral Video: ఎవుర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. పామును ఎలా పట్టుకున్నాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే
పాము ఇంట్లో దూరితే వెంటనే పాములు పట్టుకునే వారికి ఫోన్ చేస్తాం.. వాళ్ళు చాలా చక చక్యంగా పాములను పట్టుకుంటారు. ఒకొక్కరు ఒకొక్క స్టైల్ లో పాములను పట్టుకుంటారు

పాములు కనిపిస్తే చాలు వెనక్కి కూడా తిరగరకుడా పారిపోతారు కొందరు. అదే సడన్ గా కళ్ళముందుకు వస్తే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి. పాము ఇంట్లో దూరితే వెంటనే పాములు పట్టుకునే వారికి ఫోన్ చేస్తాం.. వాళ్ళు చాలా చక చక్యంగా పాములను పట్టుకుంటారు. ఒకొక్కరు ఒకొక్క స్టైల్ లో పాములను పట్టుకుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పామును ఎలా పట్టుకున్నాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అల్మారా లోపల నుంచి నాగుపామును పట్టుకునే విధంగా సంచలనం సృష్టిస్తోంది. గ్లౌజులు కూడా వేసుకోకుండా పామును పట్టుకుంటాడు, తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే.
కింగ్ కోబ్రాను పట్టుకున్న తర్వాత అతను దాన్ని బయటకు తీసుకువస్తోన్న సమయంలో అది అతని పై దాడి చేసింది. అతను నాగుపాము కాటు నుండి తప్పించుకోవడానికి దాన్ని ఎత్తుకుని గాలిలో తిప్పాడు. అతను దానిని చుట్టూ తిప్పిన తర్వాత దాని తలను పట్టుకోవడం, తరువాత నాగుపామును గోనెలో వేయడం మనం చూడవచ్చు.
ఈ వైరల్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి. ఈ వీడియో చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 123.4 k వీక్షణలు, చాలా లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. వీడియో చూసిన కొందరు నిజంగా పాము పట్టే వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతున్నారు.
seems like he done this way too many times pic.twitter.com/UIdnI2UyAy
— Humans Are Metal (@HumanAreMetal) March 28, 2023