AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తొలి 3 మ్యాచ్‌ల్లో అట్టర్ ఫ్లాప్.. కట్‌చేస్తే.. 12 ఫోర్లు, 3 సిక్సులతో ఊచకోత.. తొలి సెంచరీతో దుమ్మురేపిన ప్లేయర్..

Harry Brook: రూ.13.25 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. తొలి 3 మ్యాచ్‌ల్లో అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత.. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై హ్యారీ బ్రూక్ బ్యాట్ మెరుపులు మెరిపించింది. అతను ఫోర్లు, సిక్సర్ల వర్షంతో IPL 2023లో మొదటి సెంచరీని బాదేశాడు.

Video: తొలి 3 మ్యాచ్‌ల్లో అట్టర్ ఫ్లాప్.. కట్‌చేస్తే.. 12 ఫోర్లు, 3 సిక్సులతో ఊచకోత.. తొలి సెంచరీతో దుమ్మురేపిన ప్లేయర్..
Harry Brook Srh
Venkata Chari
|

Updated on: Apr 14, 2023 | 9:51 PM

Share

రూ.13.25 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. తొలి 3 మ్యాచ్‌ల్లో అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత.. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై హ్యారీ బ్రూక్ బ్యాట్ మెరుపులు మెరిపించింది. అతను ఫోర్లు, సిక్సర్ల వర్షంతో IPL 2023లో మొదటి సెంచరీని బాదేశాడు. 55 బంతుల్లో అజేయంగా 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సమయంలో అతను 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. బ్రూక్ ఏ KKR బౌలర్‌ను విడిచిపెట్టలేదు.

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ సుయాష్ శర్మ తప్పిదం వల్ల బ్రూక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వాస్తవానికి 10వ ఓవర్‌ను సుయాష్ బౌలింగ్ చేశాడు. అతను ఆ ఓవర్ రెండో బంతిని గూగ్లీ చేశాడు. బ్రూక్ దానిని నేరుగా బౌలర్ వైపు కొట్టాడు. బంతి సుయాష్ చేతులకు తగిలి బయటకు వెళ్లింది. అతను బంతిని పట్టుకోలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు..

సుయాష్ చేసిన ఈ ఒక్క తప్పు బ్రూక్‌కి ప్రాణం పోసింది. ఆ తర్వాత బ్రూక్‌ను ఆపడం కష్టంగా మారింది. చివరి వరకు క్రీజులో నిలిచి హైదరాబాద్ స్కోరును 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులకు చేర్చాడు. అతడితో పాటు ఐడెన్ మార్క్రామ్ కూడా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. బ్రూక్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అతను కేవలం 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు.

50 పరుగుల తర్వాత పెరిగిన వేగం..

ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఓవర్లలో బ్రూక్ కాస్త నెమ్మదించాడు. 32 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 50 పరుగులు పూర్తి చేసిన తర్వాత లాకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్లో బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఓవర్ తర్వాత అతని స్కోరు 55 నుంచి 77 పరుగులకు చేరుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో హైదరాబాద్ ఖాతాలో 23 పరుగులు చేరాయి. ఈ దశ నుంచి KKR బౌలర్లు అతనిని ఆపలేకపోయారు. ఈ బ్యాట్స్‌మన్ తన అరంగేట్రం సీజన్‌లో సెంచరీ కొట్టాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..