Viral Video: ఓర్నాయనో.. ఈ నాగుపాము చేసిన పని ఏంటో తెలిస్తే బిత్తరపోతారు..
నాగుపాము దవడలు చాలా సరళంగా ఉంటాయి. అవి తమ దవడలను చాలా వరకు తెరవగలవు, అందువల్ల అవి పెద్ద జీవులను కూడా క్షణాల్లో మింగగలవు. వాటి జీర్ణవ్యవస్థ చాలా బలంగా ఉండటం వలన అవి ఎముకలను కూడా జీర్ణం చేసుకోగలవు. సాధారణంగా కోబ్రాస్ బతికున్న జీవుల్ని వేటాడి మింగేస్తాయి. కానీ కర్ణాటకలోని ఒక గ్రామంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక కోబ్రా 12 అంగుళాల పొడవైన కత్తిని మింగింది. మెరిసే కత్తిని ఏదైనా ఆహారం అని భావించి మింగేసింది.

కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా కుమటా గ్రామంలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంటి ఎదుట ఆరుబయట పడేసిన 14 అంగుళాల కత్తిని నాగుపాము మింగే ప్రయత్నం చేసింది. అయితే కత్తిని పూర్తిగా మింగేసిన ఆ పాము.. పిడి పెద్దగా ఉండటంతో మింగలేక ఇబ్బందికర పరిస్థితిలో చిక్కుకుంది. ఆ కత్తి దాదాపు 12 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉంది.
ఇంటి యజమాని పవన్ ఆ పామును గమనించి.. కత్తి పిడి బయటకు కనిపిస్తూ ఉండటంతో.. పాము కత్తిని మింగినట్లు అంచనాకు వచ్చారు. పామును కదల్లేని స్థితిలో చూసిన పవన్ వెంటనే పశువుల ఆసుపత్రి సహాయకుడు అద్వైత్ భట్‌కు సమాచారమిచ్చారు. అద్వైత్ పామును తన ఇంటికి తీసుకెళ్లి.. దాని నోటిలో నుంచి కత్తిని బయటకు తీసేందుకు సుమారు అరగంట పాటు శ్రమించాడు. చివరికి కత్తిని సురక్షితంగా బయటికి తీయగలిగాడు. ఒకరు పామును సురక్షితంగా పట్టుకుని దాని నోరు తెరిచి ఉండేలా చూసుకున్నారు. మరొకరు జాగ్రత్తగా కోబ్రా గొంతు నుండి కత్తిని బయటకు తీశారు. దానికి ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదు. దీంతో పాముకు ప్రాణాపాయం తప్పింది. ఆ తరువాత పామును అడవిలో వదిలిపెట్టారు. ఈ సంఘటన గ్రామంలో అందరి దృష్టిని ఆకర్షించింది. పామును రక్షించడానికి తీసుకున్న చొరవకు అద్వైత్ భట్‌ను గ్రామస్థులు ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో దిగువన చూడండి…
Karnataka: In a bizarre incident in Hegde village, Kumta, Uttara Kannada, a cobra, which had entered a house, mistook a knife hanging in the kitchen for food and swallowed it. The snake, which had digested the dangerous weapon, was quickly attended to. Govinda Nayak, the… pic.twitter.com/gLx1XACkWJ
— Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) June 10, 2025