కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్‌లో డ్యాన్స్‌తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి జంట! ఒక్కో స్టెప్.. ఒక్కో డైమండ్..
దివ్వెల మాధురి గారి పెద్ద కుమార్తె వాణి గారి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఈ వేడుకలో సందడి చేశారు. భారీ స్టేజ్, అద్భుతమైన డెకరేషన్స్, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక శ్రీకాకుళం హైదరాబాద్ ప్రముఖులతో సందడిగా సాగింది.

దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ లో MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట తెగ సందడి చేసింది. స్టెప్పులతో ఈ జంట చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. మిరిమిట్లు గొలిపే లైటింగ్, కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్, భారీ డెకరేషన్ తో పెద్ద స్టేజ్ నే ఏర్పాటు చేశారు. అందుకు తగ్గట్టు కాస్ట్లీ కాస్ట్యూమ్స్ తో ఓల్డ్ సాంగ్స్ కి తగ్గ స్టెప్స్ వేసి స్టేజ్ ను షేక్ చేశారు దువ్వాడ, దివ్వెల జంట.
దువ్వాడ, దివ్వెల జంట స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ వకుళ సిల్క్స్ పేరిట ఈ జంట హైదరాబాద్ లో వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. దీంతో ఇటీవల ఎక్కువగా ఈ జంట హైదరాబాద్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మాధురి తన కుమార్తె హాఫ్ శారి ఫంక్షన్ ను హైదరాబాద్ లోనే జరిపించారు. ఈ వేడుకను శంషాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్ లో అంతా తానై వ్యవహరించారు. ఈ ఫంక్షన్ కి శ్రీకాకుళం జిల్లాకి చెందిన సెలెక్టెడ్ పర్సన్ ని ఆహ్వానించారు. హైదరాబాద్ లోని పలువురు రియల్టర్లు, సినీ ఆర్టిస్టులు హాజరయ్యారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి