viral video: కోడి నువ్వు కేక.. దెబ్బకు నెటిజన్లు నోరెళ్లబెట్టారుగా.. వైరల్ అవుతున్న వీడియో
నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే లేదు.. ఎక్కడ ఏచిన్న సంఘటన విచిత్రంగా కనిపించినా.. అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటుంది. ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన
viral video: నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే లేదు.. ఎక్కడ ఏచిన్న సంఘటన విచిత్రంగా కనిపించినా.. అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటుంది. ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇళ్ళదగ్గర్ ఎక్కువగా కనిపించే వాటిలో కోడి ఒకటి.. నిజానికి కోడి పక్షి జాతికి చెందినదే అయినప్పటికీ అది ఎగరలేదు. ఈవిషయం అందరికి తెలిసిందే.. ఏవి గట్టిగా ప్రయత్నిస్తే ఇంటి పై వరకు ఎగరగలవు అంతే.. కానీ ఓ కోడి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఓ కోడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది. ఈ కోడి చేసిన పనికి అందరూ అవాక్ అవుతున్నారు. మన ఇళ్లలో పెంచే కోళ్లు రెక్కలున్నప్పటికీ ఎత్తుగా ఎగరలేవు. కొన్నిసార్లు తన రెక్కలతో కొన్ని ప్రమాదకర పరిస్థితుల్లో మాత్రమే ఎగరడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా తక్కువ ఎత్తులో, తక్కువ దూరంలో మాత్రమే.. ఓ కోడి గాలిలో ఎగురుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఎక్కడిదో తెలియదు కానీ. కోళ్ల మంద నుంచి దూరంగా ఎగిరింది ఓ కోడి.. అది ఏకంగా ఓ నదిని సురక్షితంగా దాటేసింది. ఎగరడాన్ని సవాల్ గా స్వీకరించి ఈ కోడి ఆ నదిని దాటేసింది. పందెం వేసుకొని మరీ దాటినట్టుగా ఆ కోడి నదిని దాటడం ఇప్పుడు అందరిని షాక్ కు గురిచేస్తుంది. వైరల్‌గా మారిన ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎగిరే పక్షి ఆత్మ ఈ కోడిలో ప్రవేశించిందని కొందరూ.. యాక్షన్ సినిమాలు ఎక్కువ చూసి ఉంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఓ కోడి ఇలా ఎగురుతూ నదిని దాటడం మాములు విషయం కాదు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి
This is Amazing pic.twitter.com/8Syzdw6BnP
— Amazing Nature (@AmazingNature00) February 24, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :