Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆ కోడి కబాబ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే… రెస్టారెంట్‌ యాజమాన్యం చెప్పిన రీజన్‌తో కస్టమర్‌ షాక్‌

సాధారణంగా చికెన్‌ కబాబ్‌ ఎంత ధర ఉంటుంది? మహా అయితే ఎక్కువలో ఎక్కువ వెయ్యి రూపాయలు ఉంటుంది. కానీ, చైనాలో మాత్రం రూ.5,500 ధర పలుకుతుంది. షాంఘైలోని ఓ రెస్టారెంట్ సగం ఉడికిన చికెన్‌ను అధిక ధరకు విక్రయిస్తోంది. దీనికి ఆ రెస్టారెంట్‌ యాజమాన్యం విచిత్రమైన కారణం చెబుతోంది. ఆ రెస్టారెంట్‌లో ఇటీవల ఒక వ్యాపారవేత్త సగం ఉడికిన చికెన్ కర్రీని కొని తిన్నాడు. రసీదుపై ధర 480 యువాన్లు అని ఉంది. అంటే మన కరెన్సీలో రూ. 5,500 అన్నమాట.

Viral News: ఆ కోడి కబాబ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే... రెస్టారెంట్‌ యాజమాన్యం చెప్పిన రీజన్‌తో కస్టమర్‌ షాక్‌
Sunflower Chicken Kabab
Follow us
K Sammaiah

|

Updated on: Mar 26, 2025 | 4:28 PM

సాధారణంగా చికెన్‌ కబాబ్‌ ఎంత ధర ఉంటుంది? మహా అయితే ఎక్కువలో ఎక్కువ వెయ్యి రూపాయలు ఉంటుంది. కానీ, చైనాలో మాత్రం రూ.5,500 ధర పలుకుతుంది. షాంఘైలోని ఓ రెస్టారెంట్ సగం ఉడికిన చికెన్‌ను అధిక ధరకు విక్రయిస్తోంది. దీనికి ఆ రెస్టారెంట్‌ యాజమాన్యం విచిత్రమైన కారణం చెబుతోంది. ఆ రెస్టారెంట్‌లో ఇటీవల ఒక వ్యాపారవేత్త సగం ఉడికిన చికెన్ కర్రీని కొని తిన్నాడు. రసీదుపై ధర 480 యువాన్లు అని ఉంది. అంటే మన కరెన్సీలో రూ. 5,500 అన్నమాట. ఆ ధర చూసిన వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

వ్యాపారస్తునికి చిర్రెత్తుకొచ్చి కోడి కబాబ్‌ను అధిక ధరకు ఎందుకు విక్రయిస్తున్నావని ప్రశ్నించాడు. కోడిని నీళ్లకు బదులు పాలతో పెంచావా?అని రెస్టారెంట్ యజమానిని వ్యాపారవేత్త నిలదీశాడు. దాంతో ఆయన అవును అని సమాధానం ఇస్తూ, కోడి సాంప్రదాయ చైనీస్ సంగీతాన్ని వింటూ పెరిగిందని చెప్పాడు. నీటికి బదులుగా పాలు తాగించి పెంచామని చెప్పాడు. చికెన్ కూడా సన్‌ఫ్లవర్ చికెన్ జాతికి చెందినదని తెలిపారు.

Sunflower Hen Growing With

Sunflower Hen Growing Withరెస్టారెంట్ యాజమాన్యం సమాధానాన్ని వ్యాపారవేత్త తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. నిజానికి, సన్‌ఫ్లవర్ కోళ్లను బియ్యంతో సహా ధాన్యాలకు బదులుగా పొద్దుతిరుగుడు కాండం రసం ఇతర స్పెషల్‌ ఆహారంతో పెంచుతారు. సాంప్రదాయ సంగీతం మధ్య ఈ రకమైన కోళ్లను పెంచుతున్నట్లు కోళ్లఫారమ్‌ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఎంపరర్ చికెన్ అని కూడా పిలవబడే ఈ రకమైన చికెన్ ప్రత్యేకమైన రుచిని బట్టి హోటళ్లు, రెస్టారెంట్లలో విరివిగా వండుతారు. సన్‌ఫ్లవర్ కోళ్లు కిలోకు 200 యువాన్‌లు అంటే రూ. 2,300 ధర పలుకుతుందట.