Viral Video: అమెజింగ్.. ఈ పిల్లి ఐడియాలే వేరప్ప.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..
Cat Viral Video: చిన్న పిల్లలు ఎంత అల్లరి చేస్తారో మీరు చూసే ఉంటారు. ఎందుకంటే.. వారు రోజంతా ఏదో విధంగా అల్లరి చేస్తూనే ఉంటారు. అయితే వారి చేష్టలు చూస్తుంటే
Cat Viral Video: చిన్న పిల్లలు ఎంత అల్లరి చేస్తారో మీరు చూసే ఉంటారు. ఎందుకంటే.. వారు రోజంతా ఏదో విధంగా అల్లరి చేస్తూనే ఉంటారు. అయితే వారి చేష్టలు చూస్తుంటే చాలా సరదాగా, క్యూట్‌గా ఉంటాయి. అయితే.. చిన్నపిల్లల్లాగే కొన్ని జంతువులు కూడా చాలా సరదాగా అల్లరి చేస్తూ ఉంటాయి. వీటిలో కుక్కలు, పిల్లులు లాంటి జంతువులు కూడా అంతే అల్లరి చేస్తుంటాయి. ముఖ్యంగా మనం పిల్లుల గురించి మాట్లాడినట్లయితే.. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి కూడా చిన్న పిల్లలు లాగే తెగ అల్లరి చేస్తుంటాయి. వాటికి ఇష్టమైన వారు కనిపిస్తే.. కాళ్ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తాయి. అయితే.. సోషల్ మీడియా (Social Media) లో ఎన్ని రకాల వీడియోలు వైరల్ (Viral Video) అయినప్పటికీ.. పిల్లులకు సంబంధించిన వీడియోలు చాలా ఫన్నీగా, క్యూట్‌గా ఉంటాయి. అలాంటి ఓ వీడియో తాజాగా తెగ వైరల్ అవుతోంది.. ఇది చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు.
ఈ వైరల్ వీడియోలో ఒక మెట్లు దిగకుండా.. రేయిలింగ్ మీదకు ఎక్కుతుంది. ఈ క్రమంలో మెట్లు దిగేందుకు అద్భుతమైన ఫన్నీ మార్గాన్ని అవలంబించింది. పిల్లి హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని కిందకు జారుతుంది. ఇనుప రెయిలింగ్‌పై పిల్లి ఎలా కిందకు దిగుతుందో మీరు వీడియోలో చూడవచ్చు. ఒకసారి దాని బ్యాలెన్స్ చెదిరిపోతుంది. ఈ క్రమంలో కూడా చాలా నెమ్మదిగా రెయిలింగ్ నుంచి జారి.. కిందకు దిగి పోతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూడండి..
వీడియో చూడండి..
A different way to go downstairs.. ? pic.twitter.com/aH1yNwu4Fm
— Buitengebieden (@buitengebieden_) January 26, 2022
మీరు మీ చిన్నతనంలో ఇలాంటివి చాలానే చేసి ఉంటారు.. కానీ పిల్లి ఇలా చేయడం చూస్తే చాలా సరదాగా అనిపిస్తుందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ ఫన్నీ వీడియోను @buitengebieden_ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 16 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 8 వేల మందికి పైగా వీక్షించగా, 12 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.
Also Read: