Viral Video: ఇదేందిది.. నేనేడాచూడలే.! దెబ్బకు రెండు ముక్కలైన కారు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే!
సోషల్ మీడియాలో తరచూ ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి...
సోషల్ మీడియాలో తరచూ ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు.. అసలు ఇలా ఎలా జరిగిందని అనుకుంటాం..! తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దాన్ని చూస్తే మీరు కూడా షాక్ అవ్వడం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ కారు బురదలో కూరుకుపోయినట్లు మీరు చూడవచ్చు. దాన్ని బయటికి తీసేందుకు ఆ కారు ఓనర్ శతవిధాల ప్రయత్నిస్తాడు. అయితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడే ఓ ముగ్గురు వ్యక్తులు తమ మూడు చక్రాల స్కూటర్ ద్వారా ఆ కారును బురదలో నుంచి బయటికి లాగడానికి రెండింటి మధ్య ఓ త్రాడును కడతారు. కారు ఓనర్ కారును ముందుకు పోనివ్వగా.. అది ఒక్కసారిగా రెండు ముక్కలైపోతుంది. అసలు అది ఎలా జరిగిందో తెలియదు గానీ.. అందరూ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Car – Made in ______. ?#FillTheBlank pic.twitter.com/CnvbFoimlM
— Dipanshu Kabra (@ipskabra) March 8, 2022
కాగా, ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 45 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే వెయ్యికు పైగా నెటిజన్లు లైకులు కొట్టారు. అందరూ కూడా ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Also Read:
Viral Photo: మాములుగా ఉండదు మనతో.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.!!
Telangana: కొండ గుహ నుంచి వింత శబ్దాలు.. భయపడుతూ వెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.!
Cricket: 53 పరుగులకే 7 వికెట్లు.. కట్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లపై కెప్టెన్ పెను విధ్వంసం.. చివరికి..