Optical illusion: కళ్లను మాయ చేస్తున్న ఆప్టికల్ ఇల్యూజన్.. ఈ ఫొటోలో ఏముందో కనిపెట్టండి. అంత ఈజీ మాత్రం కాదండోయ్.
ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. చూస్తున్న కళ్లే మనల్ని మాయ చేస్తుంటాయి. కనిపించీ కనిపించకుండా ఉండే ఫొటోలు మన ఐ పవర్‌కు సవాల్ విసురుతుంటాయి. అయితే ఒకప్పుడు ఇలాంటి ఫోటోలు..

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. చూస్తున్న కళ్లే మనల్ని మాయ చేస్తుంటాయి. కనిపించీ కనిపించకుండా ఉండే ఫొటోలు మన ఐ పవర్‌కు సవాల్ విసురుతుంటాయి. అయితే ఒకప్పుడు ఇలాంటి ఫోటోలు ఎక్కువగా వార్త పత్రికల్లో కనిపించేవు. పలానా ఫోటోను దీక్షణంగా చూస్తే ఒక జంతువు కనిపిస్తుంది. గుర్తించండి అంటూ ఫోటోలు వచ్చేవి. ప్రస్తుతం మారుతోన్న కాలానికి అనుగుణంగా ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు కూడా సోషల్ మీడియా బాట పట్టాయి.
ఐ పవర్‌ను టెస్ట్ చేసేలా ఉండే ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతోంది. పైన కనిపిస్తున్న ఫొటో చూశారుగా. సహజంగా ఇలాంటి ఫొటోల్లో దాగి ఉన్న నెంబర్లను గుర్తించండి అంటూ సవాల్ విసురుతుంటారు. అయితే ఇందులో నెంబర్‌కు బదులుగా ఒక చిన్న వాఖ్యాన్ని ఇచ్చారు. తీక్షణంగా గమనిస్తే కానీ ఆ వాఖ్యం ఏంటో గుర్తించడం అంత సులువు కాదు. ఇంతకీ ఆ సెంటెన్స్ ఏంటో మీకు కనిపించిందా.?




ఎంత ప్రయత్నించినా అర్థం కావడం లేదా.? అయితే ఓసారి ఫొటోను జూమ్ చేసి చూడండి.. అక్షరాలు కనిపిస్తాయి. మొత్తం నాలుగు లైన్స్‌లో సదరు మెసేజ్ ఉంది. ఏంటీ.. ఇప్పటికీ కనిపెట్టలేకపోయారా.? ఈ ఫొటోలో ఉన్న ఆ సైలెంట్ మెసేజ్ మరెంటో కాదు.. ‘What do your eyes see?’ అని రాసి ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
