Viral Video: నాకే నిమ్మకాయ తినిపిస్తావా.. ఒంటె రియాక్షన్ చూస్తే మీ నవ్వు ఆగదు.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో యానిమల్స్ వీడియోలకు ఉండే క్రేజే వేరు. జనాలు వాటిని ఆసక్తిగా చూస్తారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిమ్మకాయ తిన్న తర్వాత ఒంటె ఇచ్చిన ఫన్నీ రియాక్షన్స్ చూసి నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. మీరు ఈ వీడియో చూడండి..

జంతువుల ఫన్నీ రియాక్షన్ల వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒంటెకు నిమ్మకాయ తినిపిస్తాడు. పుల్లని రుచికి ఒంటె ఇచ్చిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఒక కర్రపై ముందు, వెనుక చిన్న కాక్టస్ మొక్కలను పెట్టి మధ్యలో ఒక నిమ్మకాయను ఉంచుతాడు. కాక్టస్‌ను చూసి పరిగెత్తుకు వచ్చిన ఒంటె ముందున్న కాక్టస్‌ను తింటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి నిమ్మకాయను కూడా దాని నోట్లో పెడతాడు. నిమ్మకాయను కొరకగానే ఒంటె ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. పుల్లని రుచికి దాని కళ్లు మూసుకొని, పెదాలను ముడుచుకుని, వింతైన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. ఈ ఫన్నీ రియాక్షన్‌ను చూసి నవ్వు ఆపుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
మోసపోయిన ఒంటె
ఈ వీడియోను @ShouldHaveAnima అనే యూజర్ ఎక్స్‌లో నిమ్మకాయ తినమని మోసగించినందుకు ఈ ఒంటె రియాక్షన్ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. 76 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 2,22,000 మందికి పైగా వీక్షించారు. వేలాది మంది దీనిని లైక్ చేసి, వివిధ రకాల కామెంట్స్ పెట్టారు. వీడియో చూసిన ఒక నెటిజన్ సరదాగా.. జీవితం ఎంత చేదుగా ఉంటుందో ఒంటె కూడా గ్రహించినట్లు అనిపిస్తుంది” అని కామెంట్ చేయగా.. మరొకరు ఇది ఇప్పటివరకు జంతువుల అత్యంత ఫన్నీ రియాక్షన్” అని కామెంట్ చేశారు. అయితే కొందరు మాత్రం జంతువులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని.. ఇది క్రూరత్వం కిందకి వస్తుందని ఆ వ్యక్తిపై మండిపడ్డారు. కాగా నిమ్మకాయను తిన్న తర్వాత మనుషులు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ లాగే, ఒంటె కూడా రియాక్ట్ అవ్వడం మాత్రం హైలెట్ అని చెప్పొచ్చు.
This camel’s reaction to being tricked into eating a lemon pic.twitter.com/xJPJU39aSd
— Beauty Of Nature 🌳 (@ShouldHaveAnima) September 16, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
