Watch Video: బర్రెల మంద ధైర్యానికి సలాం.. వేటాడబోయిన పెద్ద పులిని వెంటబడి మరీ చంపేశాయి.. వీడియో చూస్తే షాకే..
పులి దాడిలో పశువులు మృతి.. సర్వసాదరణంగా అటవి సమీప ప్రాంతాల్లో వినిపించే మాట. ఎప్పుడు పులిదే రాజ్యమా.. మా సత్తా ఏంటో చూపిస్తాం.. కలిసికలబడితే బలహీనులమైన బలమైన రాజును మట్టి కరిపిస్తామంటూ సవాల్ విసిరి చేసి నిరూపించాయి ఆ పశువులు.

పులి దాడిలో పశువులు మృతి.. సర్వసాదరణంగా అటవి సమీప ప్రాంతాల్లో వినిపించే మాట. ఎప్పుడు పులిదే రాజ్యమా.. మా సత్తా ఏంటో చూపిస్తాం.. కలిసికలబడితే బలహీనులమైన బలమైన రాజును మట్టి కరిపిస్తామంటూ సవాల్ విసిరి చేసి నిరూపించాయి ఆ పశువులు. అడవికి రాజైన బెబ్బులుని పరిగెత్తించి పరుగెత్తించి పొడిచి పొడిచి చంపేశాయి. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకలోని అటవి ప్రాంతంలో చోటు చేసుకుంది.
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా పరిసరాల్లో పులి గాండ్రిపులు పెరిగాయి. వరుసగా గ్రామాల మీద పడుతున్న ఓ పులి వారం రోజులలో మూడు పశువులను హతమార్చింది. స్థానికులు అటవిశాఖ అదికారులకు సమాచారం ఇచ్చినా లాభం లేకుండా పోయింది. తాజాగా మూల్ తాలూకాలోని ఎస్‌గావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పశువుల కాపరి తన చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు దాడికి దిగడంతో పులి అడవిలోకి పరుగెత్తింది. బెంబాడా గ్రామం వైపు వెళ్లిన పెద్దపులి అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెలపై మంద పై దాడి చేసింది. అయితే ఇక్కడే విస్తుగొలిపే విషయం జరిగింది. పులిరాగానే భయాందోళనలకు గురై పరుగులు పెట్టకుండా గేదెలన్నీ సమిష్టిగా కలిసి బెబ్బులి కి చుక్కలు చూపించాయి. కొమ్ములతో పులిని పొడుస్తూ మందకు మంద బెబ్బులి మీద ఎదురు దాడి చేశాయి. ఈ దాడిలో పులి తీవ్రగాయాలతో అటవి సమీపంలోకి పరుగులు తీసింది. సమాచారం అందుకున్న అటవిశాక అదికారులు పులి కోసం గాలింపు చేపట్టగా సమీపంలో పులి కుప్పకూలినట్టు గుర్తించారు. హుటాహుటిన చికిత్స నిమిత్తం పులిని చంద్రపూర్ తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు.




మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
