AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది. బంధువులు.. స్నేహితుల మధ్య ఎంతో సంబరంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. చిన్న, పెద్ద

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Viral
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2022 | 8:22 PM

Share

పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది. బంధువులు.. స్నేహితుల మధ్య ఎంతో సంబరంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పెళ్లిలలో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వధూవరులిద్దరూ ఎంతో సంతోషంగా మండపంలో పెళ్లితంతులో పాల్గొంటుంటారు. ఎంతో ఘనంగా జరుగుతున్న పెళ్లి వేడకలోకి పెళ్లికూతురు మాజీ ప్రియుడు వస్తే ఎలా ఉంటుంది. కానీ ఇది నిజమే.. అట్టహాసంగా జరుగుతున్న పెళ్లి వేడుకలోకి ఆకస్మాత్తుగా వధువు మాజీ ప్రియుడిని అంటూ ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు.. అంతేకాదు.. మనకు అడ్డు ఎవరు లేరు.. భయపడకు అంటూ ఆ వధువుకు ధైర్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో వధూవరులు ఇద్దరూ వరమాల వేసుకుంటున్న క్రమంలో ఓ యువకుడు నేను వధువు మాజీ ప్రియుడి అంటూ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారంత ఉలిక్కి పడ్డారు. నేరుగా మండపం వద్దకు వచ్చి.. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే సమాజం గురించి ఆలోచించకు.. అందరిముందు మన ప్రేమ గురించి చెప్పు అంటూ అరుస్తూ ఉంటాడు. దీంతో మండపం పై ఉన్న పెళ్లి కుమారుడు నిస్సయంగా నిలబడి చూస్తూ ఉంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా.. అందరికి నువ్వు చెప్పు అంటూ ఆ పెళ్లికూతురితో వాదనకు దిగాడు. దీంతో అతను ఎవరో తెలియదని.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఆ వధువు అరుస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

Also Read: Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..

RRR Movie: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..

RRR-NTR: తారక్ నటనకు ప్రేక్షకులు భావోద్వేగం.. చరణ్.. ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్‌