Viral Video: ఫాఫం.. పెళ్లిరోజే వధువు ఇచ్చిన షాక్‌తో కంగుతిన్న వరుడు.. కెమెరా ముందు బిత్తరపోయాడు..

ఈ అందమైన క్షణాన్ని తీయడానికి ఫోటోగ్రాఫర్‌లు ఎదురుచూస్తున్నారు. వరుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన సీన్‌తో పాపం పెళ్లి కొడుకు బిత్తరపోయాడు. వధువు చేసిన ఈ పనికి వరుడు షాక్ అయ్యాడు.

Viral Video: ఫాఫం.. పెళ్లిరోజే వధువు ఇచ్చిన షాక్‌తో కంగుతిన్న వరుడు..  కెమెరా ముందు బిత్తరపోయాడు..
Viral Wedding Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 15, 2023 | 12:00 PM

పెళ్లికి సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వధువు, వరుల మధ్య జరిగే వింత సంఘటనలు, సంప్రదాయాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇంకా కొన్ని సార్లు ఇద్దరి మధ్య జరిగే గొడవలు అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వరుడికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది ఆ నవవధువు. దాంతో పాపం కొత్త పెళ్లికొడుకు బిక్కముఖం వేసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చూస్తే పరువు పోతుందని భావించి సైలెంట్‌గా చూస్తుండిపోయాడు..ఇంతకీ వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఏముందంటే..

వీడియో ఆధారంగా పెళ్లి తంతు ముగిసిందని తెలుస్తోంది. వధూవరులు, బంధుమిత్రుల సమక్షంలో సహాపంక్తి భోజనాలు చేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయికి భోజనం వడ్డించారు. ఇదంతా కెమెరామెన్ పెళ్లికూతురుకి వరుడికి తినిపించమని చెబుతాడు. ఆ సందర్భంలో, వరుడు తన చేతులతో వధువుకు ఆహారం ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వధూవరులు భోజనాల కోసం టేబుల్ వద్ద కూర్చున్నారు. కెమెరామెన్‌ ఫోటోలు, వీడియోలు తీసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతలోనే వధువు ఒక స్వీట్‌ తీసి వరుడు నోటికి అందిస్తుంది. అతడు ఆ పదార్థాన్ని ఆఫ్‌ బైట్‌ మాత్రమే తినేశాడు. సంగం మిగిలిపోయింది.. దాంతో విసుగెత్తిపోయిన నవ వధువు.. ఆ మిగిలిపోయిన పదార్థాన్ని అతడి పంళ్లెంలోనే వేసింది. ఈ అందమైన క్షణాన్ని తీయడానికి ఫోటోగ్రాఫర్‌లు ఎదురుచూస్తున్నారు. వరుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన సీన్‌తో పాపం పెళ్లి కొడుకు బిత్తరపోయాడు. వధువు చేసిన ఈ పనికి వరుడు షాక్ అయ్యాడు. మాటల్లో చెప్పలేని బాధతో కెమెరామెన్ వైపు చూడటం మనం వీడియోలో చూడొచ్చు.

ఈ పెళ్లిలో వధువు సంతోషంగా లేదని తెలుస్తోంది. ఈ వీడియో memecentral.teb అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ప్రస్తుతం వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..