Viral Video: పిల్లలపై డేగ కన్ను.. చుక్కలు చూపించిన కోడి.. షాకింగ్ వీడియో..
భూమి మీద ప్రతి తల్లి తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. బిడ్డకు ఏదైనా ఆపద వస్తే విలవిల్లాడిపోతుంది. ఏ జీవి అయినా ఇందుకు మినహాయింపు కాదు.
భూమి మీద ప్రతి తల్లి తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. బిడ్డకు ఏదైనా ఆపద వస్తే విలవిల్లాడిపోతుంది. ఏ జీవి అయినా ఇందుకు మినహాయింపు కాదు. జంతువులు కూడా తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుటుంటింది. తల్లి ప్రేమను ఎలా ఉంటుందో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే అర్థమవుతుంది. అందుకే తల్లి ప్రమేను సముద్రంతో పోల్చుతారు. నిస్వార్థంగా తన పిల్లలకు సేవ చేస్తుంది. అదే సమయంలో అవసరం వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి రక్షిస్తుంది. తన బిడ్డలను తల్లిలా ఎవరూ ప్రేమించలేరని అంటారు. ప్రతి తల్లి తన బిడ్డను చాలా ప్రేమిస్తుంది. బహుశా అందుకే తల్లి స్థానం దేవుడితో సమానం చూస్తారు. దీనిలో ఒక కోడి తన కోడిపిల్లలను రక్షించడానికి ప్రమాదకరమైన గద్దతో పోరాడింది.
ఈ వీడియోలో కోడి పిల్లలను ఎత్తుకుపోయేందుకు వచ్చిన డేగతో తల్లి కోడి పోరాడింది. కానీ దాని పిల్లలను కాపాడటానికి కోడి గద్దతో ఫైట్ చేసింది. వీడియోలో ఆకాశం నుంచి ఎగురుతూ వచ్చిన డేగ… కోడి పిల్లలపై దాడి చేయడాన్ని చూడవచ్చు. వెంటనే అలర్ట్ అయిన తల్లి కోడి తన పిల్లలను రక్షించుకునేందుకు డేగపో పోరాడింది.
ఓ సమయంలో తల్లి కోడి నుంచి తప్పించుకునేందుక డేగ భయపడి పొయింది. అయినా డేగను తల్లి కోడి వదిలిపెట్టలేదు. తరిమి.. తరిమి కొట్టింది. తల్లి కోడి చేసిన సాహసాన్ని నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. ఈ వీడియో వరల్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ విలేజ్ అనే ఛానెల్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. వార్తలు రాసే సమయం వరకు వేలాది వీక్షణలు మరియు వందలాది లైక్‌లు వచ్చాయి.
ఇవి కూడా చదవండి: Badvel By Election: బద్వేల్ బరిలో బీజేపీ లిస్ట్.. ఆ ఐదుగురి పేర్లపై అధిష్టానం ఫోకస్..