Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Plant: ఇదేక్కడి పిచ్చి సామీ.. బోర్ కొడుతుందని ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని సాదుతున్న సైంటిస్టు..

చిన్న చిన్న పనులు చేయడానికి చాలా మంది విసుక్కుంటారు. అన్నీ సిద్ధంగా, అనుగుణంగా ఉన్నప్పటికీ.. పని చేయడానికి ఆగమాగం అవుతారు. చేసే పనులు సరళమైనవి..

Dangerous Plant: ఇదేక్కడి పిచ్చి సామీ.. బోర్ కొడుతుందని ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని సాదుతున్న సైంటిస్టు..
Worlds Most Dangerous Plant
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 04, 2022 | 6:34 AM

చిన్న చిన్న పనులు చేయడానికి చాలా మంది విసుక్కుంటారు. అన్నీ సిద్ధంగా, అనుగుణంగా ఉన్నప్పటికీ.. పని చేయడానికి ఆగమాగం అవుతారు. చేసే పనులు సరళమైనవి అయినప్పటికీ.. విసుగు చెందుతుంటారు. మొక్కల పెంపకం అంటే చాల ఓపిక అవసరం. సాధారణ మొక్కను సాకాలంటేనే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన మొక్కను పెంచాలంటే? అమ్మో అని అదిరిపోతారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలను సైతం లెక్క చేయకుడా, ఎంతో ఓపికతో, జాగ్రత్తగా ప్రపంచలోనే అత్యంత విషపూరితమైన, ప్రాణాంతకమైన మొక్కను ఇంట్లో సాకుతున్నాడు.

అవును, డేనియల్ ఎమ్లిన్-జోన్స్ అనే బ్రిటీష్ వ్యక్తి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మొక్కని పెంచుతున్నాడు. అది పొరపాటును కుడితే నెలల తరబడి నరకం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. తీవ్రమైన నొప్పితో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తుందంటే అతిశయోక్తి కాదు. అలాంటి మొక్క జింపి-జింపి ని పెంచాలని నిర్ణయించుకున్నాడు 49 ఏళ్ల డేనియల్. ఈ మొక్కను ఒక ప్రమాదం గుర్తు ఉన్న బోనులో పెట్టి చాలా జాగ్రత్తగా పెంచుతున్నాడు.

జింపీ-జింపీ.. ఆస్ట్రేలియన్ స్టింగ్ ట్రీ. ఇది రేగుట లాంటి పొదను కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్క. దీని ముల్లు కుడితే.. దీనిని తాకినా.. కాల్చినట్లుగా అనిపిస్తుంది. అంటే యాసిడ్ పోస్తే ఎలా ఉంటుందో, విద్యుత్ షాక్ తగిలితే ఎలా ఉంటుందో అంతకంటే ప్రమాదకరంగా ఉంటుందన్నమాట.

ఇవి కూడా చదవండి

ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఆన్‌లైన్ ట్యూటర్ డేనియల్ మాట్లాడుతూ.. ‘నా తోటపనిలో కాస్త వైవిధ్యం ఉండాలని నేను భావిస్తారు. ఈ విత్తనాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, అది ఉన్న ప్రాంతం నుండి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే నేను దానిని నా ముందు గదిలో ఉంచాను. నేను ఆస్ట్రేలియాలోని ఒక కంపెనీ నుండి దీని విత్తనాలను పొందాను. ధర 60 ఆస్ట్రేలియన్ డాలర్లు. ఇది చౌక ఏమీ కాదు. నేను ఎప్పుడూ మొక్కలను ఇష్టపడతాను. అయితే జెరానియంలతో కొంచెం విసుగు చెందాను.’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..