Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ‘పిట్ట కొంచెం స్టామినా ఘనం’.. ఏకంగా 13,560 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా ప్రయాణించి రికార్డ్ సృష్టించిన వైనం..

రాక్షస పక్షులు కూడా చేయలేని రికార్డును ఓ చిన్న పక్షి సృష్టించింది. బార్-టెయిల్డ్ గాడ్‌విట్ అని పిలువబడే ఈ పక్షి.. నీరు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Viral News: ‘పిట్ట కొంచెం స్టామినా ఘనం’.. ఏకంగా 13,560 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా ప్రయాణించి రికార్డ్ సృష్టించిన వైనం..
Bird
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 04, 2022 | 6:23 AM

రాక్షస పక్షులు కూడా చేయలేని రికార్డును ఓ చిన్న పక్షి సృష్టించింది. బార్-టెయిల్డ్ గాడ్‌విట్ అని పిలువబడే ఈ పక్షి.. నీరు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే, తాజాగా ఈ పక్షి సరికొత్త ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా ఉత్తర అమెరికాలోని అలస్కా నుంచి ఆస్ట్రేలియాలోని టాస్మానియా వరకు అలసిపోకుండా, ఎక్కుడా రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్‌గా ప్రయాణించింది. ఏంగా 13,560 కిలోమీటర్లు ప్రయాణించి ఔరా అనిపించింది. శాటిలైట్ ట్యాగింగ్ నెంబర్ 234684 ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ఈ చిన్ని పక్షి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఇంత దూరం ప్రయాణించడానికి దానికి పట్టిన కాలం 11 రోజులు మాత్రమే. దీని వయసు కూడా కేవలం 5 నెలలు మాత్రమే కావడం మరో వండర్.

శాస్త్రవేత్తలు 5G ఉపగ్రహ ట్యాగ్‌ ఏర్పాటు చేసి దాని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. శాస్త్రవేత్తలు ఈ పక్షికి లిమోసా లాపోనికా అని పేరు పెట్టారు. దానిని అలాస్కాలో ట్యాగ్ చేశారు. ఈ చిన్న జీవి అలాస్కా నుండి బయలుదేరి.. ఆస్ట్రేలియాలో అన్సాన్స్ బేకు ఈశాన్యంగా ఉన్న టాస్మానియాలో దిగింది. ఇంతకు ముందు ప్రపంచ రికార్డ్ అదే జాతికి చెందిన 4BBRW మగ పక్షి పేరిట ఉంది. ఇది నాన్‌స్టాప్‌గా 13,000 కిలోమీటర్లు, అంతకు ముందు విక్రమార్కుడు 12,000 కిలోమీటర్లు ప్రయాణించింది.

తాజాగా ఈ చిన్ని పక్షి.. ‘లిమోసా లాప్పోనికా’ 4BBRW మగ బర్డ్ రికార్డ్‌ను స్మాష్ చేసింది. మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్నిథాలజీ బర్డ్ ఫ్లైట్ ప్రాజెక్ట్ ప్రకారం.. గాడ్విట్ ఒక వలస పక్షి. హవాయికి పశ్చిమాన ప్రయాణించి, మహాసముద్రాల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అక్టోబరు 19న పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న కైరాబతి మీదుగా ఎగురుతూ ముందుకు కదిలింది. వనాటు మీదుగా ప్రయాణించి, దక్షిణాన సిడ్నీకి తూర్పున 620 కిలోమీటర్ల వరకు కొనసాగింది. ఆస్ట్రేలియా తూర్పు తీరం, సెంట్రల్ న్యూజిలాండ్‌ను దాటింది. అక్టోబరు 23న, గాడ్‌విట్, దానితో పాటు ఎగురుతున్న ఏవైనా పక్షులు కుడివైపు మలుపు తిరిగి, పశ్చిమ దిశగా అక్టోబరు 25న టాస్మానియా చేరుకున్నాయి.

బర్డ్‌లైఫ్ ఆస్ట్రేలియాకు చెందిన సీన్ డూలీ ప్రకారం.. ‘అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చిన్న పక్షులు పెద్దల నుండి విడిపోయి విడిగా వలసపోతాయి. వయోజన పక్షులు కొన్నిసార్లు ఆరు వారాల ముందు ఆర్కిటిక్ నుండి బయలుదేరుతాయి’ అని ఆయన వివరించారు. చిన్న పక్షులు సుదీర్ఘమైన దక్షిణాది వలసలను ప్రారంభించే ముందు బొద్దుగా తమ సమయాన్ని గడుపుతుండగా, ఈ పక్షి ఒక మందలో ఉండవచ్చు అని భావిస్తున్నా పరిశోధకులు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. 11 రోజుల పాటు నాన్ స్టాప్‌గా అది ప్రయాణించడం ఆశ్చచర్యానికి గురి చేసింది.

ఈ పక్షుల్లో మరో స్పెషాలిటీ ఉంది. ఎక్కడా ఆగకుండా ప్రయాణించే ఈ పక్షులు తమ ఆహారం కోసం శరీరంలోనే కొవ్వును నిక్షిప్తం చేసుకుంటుంది. ఇందుకోసం శరీరంలోని అంతర్గత అవయవాలను సైతం కుదించుకుంటుందట.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..