Viral: భారీ స్కెచ్‌తో పోలీసులకు మస్కా.. కట్‌చేస్తే.. చివరకు బొక్కబోర్లా పడ్డాడు.. అసలేం జరిగిందంటే?
Trending: పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవడానికి దొంగలు ఎన్నో వేశాలు వేస్తుంటారు. అయితే, చాలాసార్లు విఫలం కూడా అవుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో షేర్ కాగానే, తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ దొంగ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవడానికి దొంగలు ఎన్నో వేశాలు వేస్తుంటారు. అయితే, చాలాసార్లు విఫలం కూడా అవుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో షేర్ కాగానే, తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ దొంగ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది లండన్‌లో జరిగింది. ఈ ఫొటోను లండన్ పోలీసులు నెట్టింట్లో షేర్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
దొంగతనం చేసి పారిపోతున్న సమయంలో ఓ దొంగ తన తెలివితో తప్పించుకోవాలనుకున్నాడు. ఇందుకో అతనో ప్లాన్ వేశాడు. భవనాల పైన ఏర్పాటు చేసి సౌర ఫలకాలను చూశాడు. వెంటనే ఓ ఐడియా తట్టి, పోలీసులు గుర్తుపట్టకుండా సౌర ఫలకాల వలే వాటి పక్కనే పడుకున్నాడు. అయితే, గమనించని పోలీసులు ఈ ఘరాన దొంగ కోసం గాలిస్తూనే ఉన్నారు. దొంగ మాత్రం తన తెలివికి మురిపిపోయాడు.




అయితే, ఇంతలో నేషనల్ పోలీస్ ఎయిర్ సర్వీస్ (NPAS) నుంచి వచ్చిన హెలికాప్టర్ దొంగ ఫొటోలను క్లియర్‌గా తీసింది. ఈ ఫొటోలను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. సౌరఫలకాల పక్కన అచ్చం అలాగే పడుకుని ఉన్న దొంగను చూసి నవ్వుకున్నారు. ఇంకెముంది.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అతగాడిని చెరసాలకు పంపించారు.
They’ll never find me if I just lay here and pretend I’m a solar panel!
Wrong!! https://t.co/8R4PCFiPja pic.twitter.com/HTM89tCPB8
— NPAS London (@NPASLondon) April 18, 2023
ఇదే విషయాన్ని నేషనల్ పోలీస్ ఎయిర్ సర్వీస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. “సోలార్ ప్యానెల్ లాగా నటిస్తే, గుర్తుపట్టలేమని, నన్ను ఎప్పటికీ కనుగొనలేరని, భ్రమ పడితే కష్టం” అంటూ క్యాఫ్షన్ అందించింది. ‘దొంగలకు స్నేహపూర్వక సలహా.. సోలార్ ప్యానెల్ లాగా నటిస్తూ మమ్మల్ని లేదా మా కెమెరాను మోసం చేయలేరు! చెరసాలకు మీకు స్వాగతం’ అంటూ దొంగలకు ఝులక్ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..