AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ పక్షికి ఎన్ని గుండెలు.. బ్రతికున్న పాము పొట్ట చీల్చి పేగులు బయటకు లాగి తినేసింది…

ఈ వీడియో చూస్తే ఈ పక్షికి ఎన్ని గుండెలు అని మీరే అంటారు. దాని గట్స్‌కి ఫిదా అవుతారు. పామును వెంటాడి.. అటాక్ చేసింది పక్షి. ముక్కుతో పొడిచి.. పొడిచి అల్లాడించింది.

Viral Video: ఈ పక్షికి ఎన్ని గుండెలు.. బ్రతికున్న పాము పొట్ట చీల్చి పేగులు బయటకు లాగి తినేసింది...
Bird Attacks Snake
Ram Naramaneni
|

Updated on: Jun 13, 2022 | 1:00 PM

Share

Trending Video: నాగు పాము చాలా అంటే చాలా డేంజర్. అది కానీ కాటు వేస్తే దాదాపు ఊపిరి పోయినట్లే. నిమిషాల వ్యవధిలో ట్రీట్మెంట్ అందకపోతే.. ప్రాణం పోతుంది. కాగా పాములు కప్పల్ని, ఎలుకల్ని, పక్షుల్ని.. వాటి పిల్లల్ని, గుడ్లను తినేస్తాయి. అందుకే పాము కనిపించిందంటే పక్షులు అరూస్తూ భయపడిపోతాయి. సాధ్యమైనంతవరకు ఆ పాము నుంచి దూరంగా వెళ్లిపోతాయి. పాము తమ గూళ్లలోకి దూరి.. పిల్లల జోలికి వస్తే.. అరుస్తూ అక్కడిక్కడే తిరుగుతాయి తప్ప అటాక్ చేసే సాహసం చేయవు. కానీ ఈ వీడియో చూస్తే ఈ పక్షికి ఎన్ని గుండెలు అని మీరే అంటారు. దాని గట్స్‌కి ఫిదా అవుతారు. పామును వెంటాడి.. అటాక్ చేసింది పక్షి. ముక్కుతో పొడిచి.. పొడిచి అల్లాడించింది. అదేంటో తెలీదు కానీ పాము కూడా ఎక్కువగా డిఫెన్స్ చేయలేకపోయింది. పాము అప్పుడప్పుడు భయపెట్టే ప్రయత్నం చేసినా.. పక్షి మాత్రం ఇంచ్ కూడా వెనక్కి తగ్గలేదు. తన ముక్కుతో పాముని పొట్టను పొడిచి.. పొడిచి పేగులను బయటకు తీసింది. ఆ  పక్షిని చూస్తే.. ఈ రోజు పాము మాంసం తినాలి అని డిసైడ్ అయి వచ్చినట్లు అనిపించింది. పాముకు కళ్లకు కూడా గాయాలు అయినట్లు కనిపిస్తుంది. అది ఈ పక్షి చేసిందా.. లేదా మరోదైనా దాడి చేసిందా అన్నది తెలియరాలేదు.  దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఈ రేర్ సీన్ కనిపించింది. వన్యప్రాణుల వైద్యురాలు గాబ్రియెల్లా బెనవిడెస్ ఈ షాకింగ్ ఘటనకు ఐ విట్‌నెస్. ఈ పోరాటం దాదాపు 20-25 నిమిషాల పాటు కొనసాగిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత చాలాసేపటి వరకు పాము అక్కడి నుంచి కదలకపోవడంతో అది చనిపోయిందని భావించినట్లు తెలిపారు.

జీవశాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉష్ణోగ్రత 4 ° C కంటే తక్కువగా ఉన్నప్పుడు..  పాము రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది.  ఉష్ణోగ్రత సున్నాకి చేరుకుంటే, పాము శరీరం పూర్తిగా ఘనీభవిస్తుంది. ఇది దాని మరణానికి దారితీస్తుంది. దీనివల్ల భరించలేని చలి వచ్చిన వెంటనే పాములు వేడి కోసం లోతైన గుంతల్లోకి వెళ్లిపోతాయి. ఒక్కోసారి ఎండ రాగానే బయటకు వచ్చినా.. ఆ సమయంలో అవి చాలా నీరసంగా ఉంటాయి. ఈ పాము కూడా అలాంటి స్థితిలో ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే అది చాలా వీక్‌ ఉందని.. అలవోకగా చంపేయగల పక్షితో కూడా పోరాడలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి