Bipolar Disorder: ఒకే శరీరం.. ఇద్దరు మనుషులు! బైపోలార్ డిజార్డర్‌తో టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య
కేరళలోని కాసరగోడ్‌లో 16 ఏళ్ల దేవిక అనే బాలిక బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బైపోలార్ డిజార్డర్‌కు సంబంధించిన ప్రమాదాల గురించి అవగాహన పెంచాలని తెలియజేస్తుంది. ఆత్మహత్య ప్రవృత్తిని నియంత్రించడానికి తగిన చికిత్స, మద్దతు చాలా ముఖ్యం.

మానసిక వ్యాధుల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి బైపోలార్ డిజార్డర్. అంటే ఒకే వ్యక్తి వివిధ రకాలకు ఉండటం. ఉదాహరణకు అపరిచితుడు సినిమాలో హీరో క్యారెక్టర్ ముగ్గురు వేర్వేరు మనుషుల్లా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి ఓ మానసిక వ్యాధితో బాధపడిన పదో తరగతి విద్యార్థిని చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళలోని కాసరగోడ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుట్టికోల్ పంచాయతీలోని బందడ్కలోని మణిమూలకు చెందిన దేవిక (16) అనే అమ్మాయి మంగళవారం ఉదయం తన బెడ్ రూమ్ లో చనిపోయి కనిపించింది.
దేవిక కుండంకుజి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తల్లి సవిత, బందడ్కాలోని కేరళ గ్రామీణ బ్యాంకు సమీపంలో గంజి దుకాణం నడుపుతుంది. ఆమె తమ్ముడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఆమె తండ్రి సతీష్ కూడా నాలుగు సంవత్సరాల క్రితం అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వారి ఇంటి పక్కనే నివసించే అతని సోదరి కుమార్తె కూడా ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే దేవిక మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ నిర్వహించి దేవికకు బైపోలార్ డిజార్డర్ ఉన్నట్లు వెల్లడించారు. ఆమె కొంత కాలం నుంచి కన్హాంగడ్‌లోని కాసరగోడ్ జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచించిన మందులు వాడుతున్నారని చెప్పారు. సుమారు మూడు నెలల క్రితం దేవికను పరియారం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు ఆమెకు మందులు కొనసాగించమని సలహా ఇచ్చారు.
అయితే ఈ బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో ప్రమాదాలు, హింస, ఆత్మహత్యలతో చనిపోయే అవకాశం ఆరు రెట్లు ఎక్కువని నిపుణులు అంటున్నారు. సాధారణంగా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడేవారు ఎక్కువగా అంటే 58 శాతం ఆత్మహత్య చేసుకునే తమ ప్రాణాలు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
