Watch Video: ఇలా వచ్చాడు.. అలా వెళ్లాడు.. ట్రక్కును మింగేసిన సింక్‌హోల్.. షాకింగ్ వీడియో.. ఎక్కడో తెలుసా?
మెక్సికో నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోడ్డుపై వెళ్తున్న ఒక ట్రక్కు సడెన్‌గా ఒక సింక్ హోల్‌లో పడిపోయింది. అందరూ చూస్తుండగానే ఆ ట్రక్కు నిటారులో ఆ రంద్రంలోకి పడిపోయింది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రోడ్డుపై వెళ్తున్న ఒక ట్రక్కు సడెన్‌గా ఒక సింక్ హోల్‌లో పడిపోయిన ఘటన మెక్సికో నగరంలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్ వీడియో ప్రకరాం.. కూల్ డ్రింక్స్ లోడ్‌తో వస్తున్న ఒక ట్రక్కు రోడ్డుపై ఉన్న ఒక పాత డ్రైనేజీ పైనుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ ఆ డ్రైనేజ్ సడెన్ కూలి పోవడంతో.. ఆ భారీ ట్రక్ డ్రైనేజ్ గుంతలో పడిపోయింది.
మొదటగా ట్రక్ వెనక భాగం గుంతలోకి నెమ్మదిగా జరుకుంది. ఆ క్రమంలో టక్కు ముందు భాగం మొత్తం గాలిలోకి లేచినట్టు, ఆ సమయంలో డ్రైవర్ ట్రక్కులోనే ఉన్నట్టు మనం చూడవచ్చు. ఇలా కొద్ది సేపటి ఆ టక్కు నిటారుగా మొత్తం ఆ డ్రైనేజ్‌లోకి పడిపోయింది. అక్కడే ఉన్న జనాలు ఈ దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బారీ క్రేయిన్ సహాయంతో ట్రక్కును బయటకు తీశారు. అయితే అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థ చాలా పాతకాలం నాటిదని. కాబట్టి అదే కూలీ పోయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్రం కలకలం రేపింది.
వీడియో చూడండి..
😱 Sinkhole in Mexico “swallowed” a soda truck
In Mexico City, a soda truck plunged into a massive sinkhole that suddenly opened up in the road. Luckily, no one was injured, Reuters reports.
The local district chief explained that the incident was caused by an “extremely old”… pic.twitter.com/sPQMkiY7Z7
— NEXTA (@nexta_tv) September 15, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
