టపాసులు అంటే అంత భయమా? దీపావళి వేళ నెట్టింట నవ్వులు పూయిస్తోన్న వీడియో.. ‘పడి పడి’ నవ్వాల్సిందే
టపాసులు, బాంబులు కాల్చాలంటే చాలామందికి భయం ఉంటుంది. వారు భయపడుతూనే వాటిని కాలుస్తుంటారు. ఒక్కోసారి అవి నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది.

మరికొన్ని రోజుల్లో దీపావళి పండగ వచ్చేస్తోంది. ఇప్పటికే పండగ హడావిడి మొదలైంది. బాణసంచా, టపాసుల కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే కేవలం దీపావళి పండగ కోసమే కాకుండా పండగలు, పార్టీలు, ఏదైనా ప్రారంభ వేడుకల సమయాల్లోనూ టపాసులు కాలుస్తుంటారు. అయితే టపాసులు, బాంబులు కాల్చాలంటే చాలామందికి భయం ఉంటుంది. వారు భయపడుతూనే వాటిని కాలుస్తుంటారు. ఒక్కోసారి అవి నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. బాణసంచా కాల్చేందుకు ప్రయత్నించి ఓ ఎమ్మెల్యే బొక్కబోర్లాపడ్డాడు. మొహం కూడా పగులగొట్టుకున్నాడు. బిహార్‌లో ఈ సంఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించడానికి బీజేపీ ఎమ్మెల్యే వినయ్‌కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలను ప్రారంభించిన ఆయన.. దానికి సంకేతంగా ఓ పటాకీ పేల్చారు. గ్రౌండ్ మధ్యలో టపాసును పెట్టి అగ్గిపుల్లతో ముట్టించారు. అయితే అది తన మీద పడతాయని భావించారేమో.. కానీ ఒక్కసారిగా వెనక్కి పరుగు తీశారు. ఆ క్రమంలో పట్టుతప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల ఉన్న వారందరూ ఎమ్మెల్యేను లేపేందుకు పరుగులు తీశారు.
కాగా కొద్దిక్షణాల్లోనే ఎమ్మెల్యే అంటించిన టపాసు.. భారీ శబ్ధం చేస్తూ పేలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే వినయ్ కుమార్ స్థానిక బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అతనిని ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈక్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.




#Bihar वायरल वीडियो बिहार के सोनपुर जिले का है. यहां एक फुटबॉल मैच के उद्घाटन के दौरान पटाखा जला कर भागते पूर्व बीजेपी विधायक विनय सिंह गिर पड़े. #Viral #Video #BJP #MLA pic.twitter.com/Y6AfCnKzVP
— Ashish Mishra (@AshishMisraRBL) October 18, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
