Viral: క్యాబ్ బుక్ చేసుకున్న మహిళ.. వచ్చిన డ్రైవర్‌ను చూసి అవాక్కు..
ప్రస్తుతం చాలామంది రెగ్యులర్ జాబ్స్ చేసే ఉద్యోగులు సైతం ఖాళీ సమయాల్లో ఉబర్, ర్యాపిడో వంటి వాటిల్లో రైడ్స్ అందిస్తూ ఎంతో కొంత సొమ్ము సంపాదిస్తున్నారు. తాజాగా ఉబర్ బుక్ చేసుకున్న ఓ బెంగుళూరు మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

బెంగళూరులో ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆఫీసుకు ఉబర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది. రైడ్ పిక్ చేసుకోడానికి వచ్చిన వ్యక్తిని చూసి ఆమె అవాక్కయింది. ఎందుకంటే.. వచ్చింది తన ఆఫీసులోనే పని చేసే టీమ్ లీడ్. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆమె ఒక స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. “ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. నేను ఉబర్ బుక్ చేశాను, నన్ను పిక్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి మా ఆఫీసులో టీమ్ లీడ్ ” ఆమె పేర్కొంది. ఎందుకు సార్ ఇలా క్యాబ్ డ్రైవ్ చేస్తున్నారు అని ఆమె అడగ్గా.. “ఏదో సరదా కోసం. బోర్ కొట్టకుండా” అని అతని వైపు సమాధానం వచ్చిందట.
ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు వివిధ విధాలుగా స్పందిస్తున్నారు. ఇదేం సరదా బాబు అంటూ కొందరు స్మైలీ ఎమోజీలు పెడుతున్నారు. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే నగరంలో సరదా కోసం క్యాబ్ డ్రైవింగ్.. ఈ కేసు ఏదో తేడాగా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. “అమెరికాలో, ఒక పెద్ద సంస్థ CEO కూడా.. పార్ట్ జాబ్ కింద హోటల్లో సర్వర్‌గా పని చేయడానికి వెనకాడరు. కానీ మన దగ్గర ఇదో పెద్ద విషయం” అని మరొకరు కామెంట్ పెట్టారు.
గతంలోనూ ఇలాంటి ఘటన
జూలై 2024లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఒక మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీకెండ్‌లో ఆటో డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. తన కంపెనీ హుడీ ధరించి, తన జీవితంలో ఒంటరితనాన్ని అధిగమించడానికే డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలిపడం అప్పట్లో వైరల్‌గా మారింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
