Optical illusion: తోపులు అనుకున్నోళ్లే తుస్సుమన్నారు.. ఇందులో పిల్లిని మీరు కనిపెట్టగలరా
పజిల్స్ అంటే పాతకాలంలాగా సండే బుక్‌లో వచ్చేవి మాత్రమే కాదండోయ్. ఇప్పుడంతా అప్ డేటెడ్ జనరేషన్. సోషల్ మీడియాలో రోజూ రకరకాల పజిల్స్ వైరల్ అవుతున్నాయి. అందులో మీ తెలివితేటలు, ఐ ఫోకస్ టెస్ట్ చేసే ఇల్యూజన్ పజిల్స్ ఎక్కువగా ఉంటున్నాయ్..

ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో కంటెంట్‌కు ఎలాంటి కొదవ లేకుండా పోయింది. మీరు గమనించారో లేదో ఈ మధ్య పజిల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అంటే భాషపై మీ పట్టు తెలిపే పదాలకు సంబంధించిన పజిల్స్ మాత్రమే కాదండోయ్.. మీ అబ్జర్వేషన్ స్కిల్స్, మీ నాలెడ్జ్, ఐ ఫోకస్, తెలివితేటలు తెలిపే ఇతర పజిల్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు ఇచ్చి ఇందులో దాగుంది ఏదో కనుగొనండి వంటివి మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఇవి ఏదో చిన్న పిల్లలు ఆడేవి అని కొట్టి పారయకండి. కొన్నిసార్లు తలపండినోళ్లు సైతం వీటిని చేధించలేక తుస్సుమంటున్నారు. తాజాగా అలాంటి చిత్రాన్ని మీ ముందుకు తెచ్చాం.
పైన ఉన్న ఫోటోను బాగా గమనించండి. హా ఏముంది ఓ చెట్టు తొర్రగా అనుకోండి. అక్కడే ఓ పిల్లి కూడా నక్కి ఉంది. అది ఎక్కడ ఉందో మీరు పసిగట్టాలి. ఇంకో విషయం ఏంటంటే.. ఓ గంటలు గంటలు సమయం తీసుకుంటామంటే కుదదరు. కేవలం 6 సెకన్లలోనే దాని ఆచూకి పసిగట్టాలి. అప్పుడే మీ దృష్టి ఎంత ఫోకస్‌తో ఉందో తెలుస్తుంది. మరి.. ఫోటోలో దాగి ఉన్న పిల్లిని ఇంత తక్కువ సమయంలో మీరు కనిపెట్టగలరా?.
పచ్చని, ఎండిన చెట్ల మధ్య దాక్కున్న పిల్లిని కనుగొనడం అంత సులభం కాదు. కానీ మీరు శ్రద్ధ పెడితే ఖచ్చితంగా దానిని కనిపెడతారు. మీకు కావలసిందల్లా చురుకైన ఫోకస్. ఏంటి ఇంకా చిక్కలేదా ఫోటోని మిడిల్‌లో బాగా తీక్షణంగా చూడండి. ఇంకా కనిపెట్టకపోతే లీవ్ ఇట్.. సమాధానం ఉన్న ఫోటోను మీకు దిగువన అందిస్తాం. ఈ సారి మంచి ఫోకస్ పెట్టి.. పజిల్స్ సాల్వ్ చేయండి..

Cat In The Circle
