Viral Video: గోడ నిండా తేనెతుట్టే.. చూస్తే షాకవ్వాల్సిందే… దీని వెనుక పెద్ద కథే ఉంది

గ్లోబల్ వార్మింగ్, పంపపొలాల్లో రసాయనాలు, పురుగు మందుల వినియోగం, మితిమీరిన పొల్యూషన్ కారణంగా తేనెటీగలు చనిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.

Viral Video: గోడ నిండా తేనెతుట్టే.. చూస్తే షాకవ్వాల్సిందే... దీని వెనుక పెద్ద కథే ఉంది
Honey Bees Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 11, 2021 | 7:23 PM

గ్లోబల్ వార్మింగ్, పంపపొలాల్లో రసాయనాలు, పురుగు మందుల వినియోగం, మితిమీరిన పొల్యూషన్ కారణంగా తేనెటీగలు చనిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. తేనెటీగల వల్ల లాభమేంటి? అని అడిగితే… తియ్యనైన తేనె లభిస్తుందని ఈజీగా చెప్పేస్తారు.  కానీ… వరల్డ్ వైడ్ 70 శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి జరుగుతోంది. ఇది మేము కాదు సైంటిస్టులు చెబుతున్న మాట.  మనం పండిస్తున్న 100 రకాల పంటల్లో 90 రకాల పంటల నుంచి ఫలాలు అందాలంటే తేనెటీగలే ఆధారం. పువ్వుల్లోని పుప్పొడి రేణువుల్ని తేనెటీగలు మోసుకెళ్లడం వల్లే పరాగ, పరపరాగ సంపర్కం జరిగి.. తద్వారా పువ్వుల నుంచి కాయలు, పండ్లు కాస్తాయి. అంతేకాదు… ఈ భూమ్మీద ఉన్న జీవరాశుల్లో ఒక్క తేనెటీగలు మాత్రమే రోగాలను వ్యాప్తి చేయవని ఓ పరిశోధనలో తేలింది.  అందుకే ప్రపంచ దేశాలు వాటి సంఖ్యను పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ యువతి చేస్తున్న పని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈమె తేనెటీగలను పెంచుతున్న తీరు చూసి నెటిజన్లు  మెచ్చుకుంటున్నారు.

అమెరికా… టెక్సాస్‌కు చెందిన ఎరికా థాంప్సన్ తేనెటీగలను పెంచుతుంటారు. ఈ క్రమంలో ఆమె పెరట్లోని ఓ ఇంటి బ్యాక్‌యార్డ్ షెడ్‌ గోడలో కొన్నేళ్లుగా తేనెటీగలకు ఆవాసం కల్పిస్తున్నారు. ఎరికా తేనెను కూడా సేకరిస్తారు. అయినా కూడా.. తేనెటీగలు అక్కడి నుంచి వెళ్లవు.  అక్కడున్న వేల తేనెటీగల్లో రాణి తేనెటీగను కనిపెట్టి దాన్ని మరో చోట ఉంచుతుంది. దీంతో మిగిలిన తేనెటీగలన్నీ ఆ రాణి తేనెటీగను ప్రొటెక్ట్ చేసేందుకు అక్కడికి వెళతాయి. అక్కడ తేనెతుట్టును తయారుచేస్తాయి. ఇలా ఆమె సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ.. తేనెటీగలకు హాని కలిగించకుండా.. రాణి తేనెటీగ సాయంతో తేనెను సేకరిస్తుంది. ఐడీయా అదిరిపోయింది కదూ. ఈ విషయంలో ఎరికాకి చాలా అనుభవం ఉంది. ఇదేదో బాగుంది కదా అని…  మీరు కూడా ఇలా ట్రై చేశారంటే.. ఐపోతారు జాగ్రత్త.

Also Read: నడి ఎడారిలో పాపడాల ఫ్రై.. నెట్టింట మిలియన్న కొద్దీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతున్న వీడియో

Viral Video: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు…

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి