Viral Video: రెస్టారెంట్ నిండా రంగురంగుల చేపలు.. ఈ స్వీట్‌ఫిష్‌ కేఫ్‌ ప్రత్యేకత ఏంటంటే..

కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం హోటళ్లు, రెస్టారెంట్లు కొత్త కొత్త ఆఫర్‌లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. అదేవిధంగా లైవ్‌ మ్యూజిక్‌ ఏర్పాటుచేయడం, రెస్టారెంట్లోని గదులను అందంగా అలంకరిచడం...

Viral Video: రెస్టారెంట్ నిండా రంగురంగుల చేపలు.. ఈ స్వీట్‌ఫిష్‌ కేఫ్‌ ప్రత్యేకత ఏంటంటే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2021 | 3:49 PM

కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం హోటళ్లు, రెస్టారెంట్లు కొత్త కొత్త ఆఫర్‌లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. అదేవిధంగా లైవ్‌ మ్యూజిక్‌ ఏర్పాటుచేయడం, రెస్టారెంట్లోని గదులను అందంగా అలంకరిచడం వంటివి కూడా చేస్తుంటాయి. ఈ క్రమంలో ఒక రెస్టారెంట్‌ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఓ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఇందులో భాగంగా రెస్టారెంట్‌ని ఏకంగా చేపల అక్వేరియంలా మార్చేసింది. ఇందులో భాగంగా చెక్కతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫ్లోరింగ్‌పై మోకాలి లోతు వరకు నీటితో నింపింది. అందులో రంగురంగుల చేపలను వదిలిపెట్టింది. అందులోనే కుర్చీలు, టేబుల్స్‌ను ఏర్పాటుచేసి కస్టమర్లను ఆహ్వానించింది. నీళ్లలోని రంగురంగుల చేపలను చూస్తూ తాము అందించే ఆహార పదార్థాలను ఆస్వాదించమని గోడలపై ‘స్వీట్‌ ఫిష్‌ కేఫ్‌’ అని రాసుకొచ్చింది.

చేపలు చనిపోవు..! ఈ రెస్టారెంట్‌ ఎక్కడుందో తెలియట్లేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘ కస్టమర్లను ఆకట్టుకునేందుకు మీ ఆలోచన బాగుంది కానీ.. తినే ఆహార పదార్థాలు నీటిలో పడి కలుషితమై చేపలు లావైపోతాయి లేదా చనిపోతాయి’ అని ఒకరు కామెంట్‌ పెట్టగా ‘ విద్యుత్‌ సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని మరొకరు స్పందించారు. మరి ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోనూ మీరూ చూసేయండి..

Also read:

Viral Video: బాధితుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీసు.. శభాష్ రాజేశ్వరి అంటూ ప్రశంసలు.. వైరల్‎ అయిన వీడియో..

Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై.. నెట్టింట మిలియన్న కొద్దీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతున్న వీడియో

Viral Video: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు…

మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!